కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పాత వీడియో క్లిప్‌ను తప్పుడు దావాతో షేర్ చేస్తున్నారు


TPCC అధినేత రేవంత్ రెడ్డి సభలో ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో పోస్టు చేస్తూ “కాంగ్రెస్ సభలో కేసీఆర్ నినాదాలు, ఓర్వలేక ప్రజలను దూషించిన రేవంత్ రెడ్డి” అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: కాంగ్రెస్ సభలో కెసిఆర్ నినాదాలు పలికిన ప్రజలను రేవంత్ రెడ్డి దూషించారు. 

ఫాక్ట్(నిజం): ఈ వీడియో క్లిప్ 2021లో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రోజున జరిగిన సభలోనిది. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా సభలోని ప్రజలు ‘CM’ నినాదాలు చేశారు, కేసీఆర్ నినాదాలు కాదు. దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఈ రోజు నుంచి జై సోనియమ్మ, జై కాంగ్రెస్ తప్ప ఏదైనా వ్యక్తిగత నినాదాలు చేస్తే పార్టీ నుంచి భహిష్కరించబడతారు. నన్ను అభిమానించేవాళ్ళు ఎవరూ కూడా ఇటువంటి వ్యక్తిగత స్లోగన్లు ఇవ్వకూడదు అని విజ్ఞప్తి చేస్తున్నాను” అని తెలిపారు. ఈ సభ యొక్క పూర్తి వీడియోను, వివిధ టైంస్టాంపుల వద్ద ట్రిమ్ చేసి షేర్ చేస్తున్నారు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ సభ యొక్క ప్రత్యక్ష ప్రసారం పలు మీడియా ఛానెల్లు  YouTubeలో ప్రచురించాయి అని గమనించాం (ఇక్కడ మరియు ఇక్కడ). 

వీడియో క్లిప్, 2021లో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రోజున జరిగిన సభలోనిది. పూర్తీ వీడియోను గమనిస్తే, ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా ప్రజలు ‘CM’ నినాదాలు చేశారు, కేసీఆర్ నినాదాలు కాదు అని తెలిసింది. అయితే, దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఈ రోజు నుంచి జై సోనియమ్మ, జై కాంగ్రెస్ తప్ప ఏదైనా వ్యక్తిగత నినాదాలు చేస్తే పార్టీ నుంచి భహిష్కరించబడతారు. యువ మిత్రులకు అభిమానం ఉన్నప్పటికీ వ్యక్తిగత నినాదాలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం. నన్ను అభిమానించేవాళ్ళు ఎవరూ కూడా ఇటువంటి వ్యక్తిగత స్లోగన్లు ఇవ్వకూడదు అని విజ్ఞప్తి చేస్తున్నాను” అని తెలిపారు. ఈ ఫుల్ వీడియోను, వివిధ టైంస్టాంపుల వద్ద ట్రిమ్ చేసి షేర్ చేశారు అని గమనించాం. 

ఈ సభకు సంబంధించిన సమాచారాన్ని పలు వార్త పత్రికలు కూడా ప్రచురించాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

చివరిగా, కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన పాత వీడియో క్లిప్‌ను తప్పుడు దావాతో షేర్ చేస్తున్నారు.