పాత వీడియో పెట్టి లాక్ డౌన్ లో వలస కూలీల నుండి లంచం తీసుకుంటున్న రైల్వే పోలీస్ అని ప్రచారం చేస్తున్నారు

రైల్వే ట్రాక్ పక్క నుండి నడుచుకుంటూ వెళుతున్న కొంతమంది మహిళల నుండి పోలీసులు డబ్బులు తీసుకుంటున్న వీడియోని సోషల్ మీడియా లో పెట్టి లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు తమ స్వస్థలానికి వెళుతున్నప్పుడు లంచం తీసుకుంటున్న రైల్వే పోలీస్ అని ప్రచారం చేస్తున్నారు. కానీ, FACTLY అది ఒక పాత వీడియో అని తెలుసుకుంది. ఆ వీడియో లో ఉన్నది లాక్ డౌన్ సమయం లో జరిగిన సంఘటన కాదు. అదే వీడియో తో జులై 2019 లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, సూరత్  కి చెందిన ఒక RPF జవాన్ అక్రమ వ్యాపారం చేసే ఒక మహిళ దగ్గర నుండి లంచం తీసుకుంటున్న సంఘటనకు సంబంధించిన వీడియో అని తెలుస్తుంది. గత సంవత్సరం ఆ వీడియో వైరల్ అయినప్పుడు, లంచం తీసుకున్న ఆ RPF జవాన్ ను సర్వీస్ నుండి డిస్మిస్ కాబడ్డాడు.  ఆ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. న్యూస్ ఆర్టికల్ – https://www.deshgujarat.com/2019/07/13/rpf-jawans-in-surat-dismissed-from-service-after-his-video-taking-bribe-goes-viral/
2. న్యూస్ ఆర్టికల్ – https://ahmedabadmirror.indiatimes.com/videos/sectionhomelist/rpf-constable-dismissed-after-video-of-him-demanding-bribes-goes-viral/videoshow/70277220.cms
3. న్యూస్ వీడియో – https://www.youtube.com/watch?v=J5EYbyKauww

Did you watch our new video?