ఇటీవల చెన్నైలో వచ్చిన వరదల కారణంగా సత్యభామ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నీటితో నిండిన రోడ్లపై నడుస్తున్నట్టు వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. అక్టోబర్ 2024లో చెన్నైలో వరదలు సంభవించిన సందర్భంలో ఈ పోస్ట్ షేర్ చేయబడింది. ఈ ఆర్టికల్ ద్వారా ఆ వీడియోలో ఉన్న నిజమెంతో తెలుసుకుందాం.
క్లెయిమ్: ఇటీవల అక్టోబర్ 2024లో చెన్నైలో వచ్చిన వరదల కారణంగా సత్యభామ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నీటితో నిండిన రోడ్లపై నడుస్తున్న దృశ్యాల్ని చూపిస్తున్న వీడియో
ఫాక్ట్(నిజం): ఈ వీడియో డిసెంబర్ 2023 నాటిది. 5 డిసెంబర్ 2023న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఇది డిసెంబర్ 2023లో తమిళనాడును మిచాంగ్ తుఫాను ప్రభావితం చేసిన తర్వాత పోస్ట్ చేయబడింది. ఈ వీడియో అక్టోబర్ 2024లో వచ్చిన చెన్నై వరదలకు సంబంధించింది కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, 05 డిసెంబర్ 2023న అదే ప్రదేశం నుండి అప్‌లోడ్ చేసిన మరొక ఇలాంటి ఇన్‌స్టాగ్రామ్ వీడియోకి దారితీసింది. ఈ పోస్ట్ డిసెంబర్ 2023లో తమిళనాడుపై మిచాంగ్ తుఫాను ప్రభావం తర్వాత పోస్ట్ చేయబడింది.
రెండు వీడియోలను పోల్చి చుసిన తర్వాత, ఈ రెంటి మధ్య అనేక సారూప్యతలను గమనించాము, వాటిని క్రింద చూడవచ్చు.
2023 ఇన్‌స్టాగ్రామ్ వీడియోలోని ప్రదేశం సత్యభామ విశ్వవిద్యాలయం, చెన్నై అని మేము ధృవీకరించాం. ఈ ప్రదేశాన్ని పరిశీలించడానికి మేము గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూను ఉపయోగించాం.
చివరిగా, చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో వరదలున్న రోడ్లపై విద్యార్థులు నడుస్తున్న పాత డిసెంబర్ 2023 వీడియోని అక్టోబర్ 2024లో చెన్నైలో సంభవించిన వరదలకు సంబంధించినదని షేర్ చేస్తున్నారు.