పది నిమిషాలకు ఒకసారి రూపాంతరం చెందే వింత జీవి యొక్క దృశ్యాలు అని చెప్తూ ఒక AI జనరేటెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.

పది నిమిషాలకు ఒకసారి రూపాంతరం చెందే జీవి యొక్క ఫౌండ్ ఫుటేజ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బ్రహ్మంగారు చెప్పింది ఏది తప్పదు, ఇది ఏలియన్ అనుకుంట..! cc tv కి దొరికిన విడియో’ అని చెప్తూ షేర్ చేస్తున్న ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఎంతో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: పది నిమిషాలకు ఒకసారి రూపం మార్చుకుంటున్న వింత జీవి యొక్క సీసీ టీవీ ఫుటేజ్.

ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో. దీన్ని ‘voidstomper’ అనే AI ఆర్టిస్ట్ తయారు చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చెక్ చేస్తే, ఈ వీడియో మాకు ‘voidstomper’ అనే ‘X’ అకౌంట్లో దొరికింది.

‘A world unknown- Shadecore’ అనే వివరణతో ఈ వీడియోను 9 సెప్టెంబర్ 2024న  ‘voidstomper’ అప్లోడ్ చేశారు. ఈ ‘X’ అకౌంట్ యొక్క బయోలో ఇచ్చిన లింక్స్ చూస్తే, వీళ్ళకి ‘Tik Tok’లో ‘Shadecore’ మరియు ‘Voidstomper’ అనే పేర్లతో రెండు అకౌంట్లు ఉన్నాయి అని మాకు అర్థం అయ్యింది. అలాగే ‘Voidstomper’ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది.

ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ‘వింత జీవి’ వీడియోని వీళ్లు ‘Tik Tok’లో, ఇన్‌స్టాగ్రాంలో  9 సెప్టెంబర్ 2024న అప్లోడ్ చేశారు (ఇక్కడ, ఇక్కడ).

అయితే, ఇది ఒక ‘ఎడిట్’ చేయబడ్డ వీడియో అని ఒక యూజర్ ఈ పోస్ట్ కింద కామెంట్ చేస్తే, దీన్ని AI ఉపయోగించి చేసారని వాళ్ళు చెప్పారు. ఏ AI జనరేషన్ టూల్ ఉపయోగించి ఈ వీడియోను తయారు చేశారని ఒక యూజర్ అడిగిన ప్రశ్నకి, ప్రస్తుతానికి Runway  మరియు Luma ఉపయోగించి చేస్తున్నారు అని చెప్పారు. 

ఈ విషయాన్ని వెరిఫై చేయడానికి వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ‘hugging face’ వారి AI డిటెక్టర్‌లో చెక్ చేస్తే, ఇది ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసినది అని రిపోర్ట్ వచ్చింది. 

చివరిగా, పది నిమిషాలకు ఒకసారి రూపాంతరం చెందే వింత జీవి యొక్క సీసీటీవీ ఫుటేజ్ అని క్లెయిమ్ చేస్తున్న ఈ వీడియో నిజానికి AI ద్వారా తయారు చేసిన ఒక వీడియో.