పశ్చిమ బెంగాల్‌లో పులుల సంత నిర్వహిస్తున్నట్లుగా గూగుల్ ‘Veo’ AI ద్వారా రూపొందించిన వీడియోను షేర్ చేస్తున్నారు

బెంగాల్లో పులుల సంత” కు సంబంధించిన దృశ్యాలు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్‌లో ఉన్న పులుల సంత (మార్కెట్)కు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో నిజమైన పులుల సంతను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో గూగుల్ ‘Veo’ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, ఇందులో పలు తప్పిదాలు/ అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వీడియోలో కనిపించే వ్యక్తుల, పులుల మొహాలు, వారి/వాటి అహాభావాలు అసహజంగా ఉండటం మనం చూడవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో ఇటువంటి లోపాలు సహజంగానే ఉంటాయి (ఇక్కడఇక్కడ).

తదుపరి ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, యూట్యూబ్‌లో షేర్ చేయబడిన ఈ వైరల్ వీడియో యొక్క అన్‌క్రాపెడ్ (Uncropped) వీడియో లభించింది. ఈ యూట్యూబ్‌ వీడియో వివరణలో ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిందని పేర్కొనబడింది. అలాగే, ఈ అన్‌క్రాపెడ్ వీడియోలో కుడివైపు క్రింద భాగంలో “Veo” అనే వాటర్‌మార్క్‌ను మనం చూడవచ్చు (ఇక్కడఇక్కడ, & ఇక్కడ). ఈ వాటర్‌మార్క్‌ ఈ వైరల్ వీడియోను గూగుల్ ‘Veo’ AI మోడల్‌ను ఉపయోగించి రూపొందించబడిందని సూచిస్తుంది (ఇక్కడఇక్కడఇక్కడ, & ఇక్కడ).

గూగుల్ AI మోడల్స్ ద్వారా రూపొందించబడిన ఫోటోలు, వీడియోలను గుర్తించే గూగుల్ వారి ‘సింథ్ ID (synth ID)’ టూల్, ఈ వీడియో గూగుల్ AIని ఉపయోగించి సృష్టించబడిందని నిర్ధారించింది.

 HiveCantilux వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వీడియోను పరిశీలించగా, ఈ వైరల్ వీడియో 89% AI-జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇవ్వగా, ఈ వైరల్ వీడియో 94% AI-జనరేటెడ్ కావచ్చని Cantilux ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో గూగుల్ AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, ఈ వైరల్ వీడియో ఫేక్, ఇది గూగుల్ ‘Veo’ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది.