“దేవుడు చేసిన అద్భుతాలు” అంటూ పువ్వుల ఆకారంలో ఉన్న వివిధ కీటకాలను చూపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పువ్వుల ఆకారంలో కనిపించే కీటకాలు నిజమైనవా? కాదా? అని నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్ టిప్‌లైన్‌కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పువ్వుల ఆకారంలో ఉన్న వివిధ కీటకాలను చూపిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించబడ్డాయి. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ‘oleg.pars’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అప్‌లోడ్ చేయబడ్డాయి. ఈ దృశ్యాలను షేర్ చేస్తూ, ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీ, ఇవి AI ఉపయోగించి రూపొందించబడ్డాయని పేర్కొంది. అలాగే, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలను AI ద్వారా రూపొందించబడ్డాయని పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోలో 9 వేర్వేరు వీడియో క్లిప్‌లు ఉన్నాయి, ఈ వీడియో క్లిప్‌లకు సంబంధించిన వివరాల కోసం, ఈ వీడియో క్లిప్‌ల యొక్క స్క్రీన్‌షాట్‌లను గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వైరల్ వీడియోలోని 9 (తొమ్మిది) వీడియో క్లిప్‌లను, ‘oleg.pars’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియో క్లిప్‌లను, షేర్ చేస్తూ, ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీ, ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (@krea_ai) ఉపయోగించి రూపొందించబడ్డాయని పేర్కొంది.
అలాగే, ఈ పేజీ యొక్క బయోలో ‘డిజిటల్ క్రియేటర్’ అని, ఇంకా ‘In constant (re)search of unbelievable creatures’ (నమ్మశక్యం కాని జీవుల కోసం నిరంతర అన్వేషణ) అని రాసి ఉంది. ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీనీ మనం పరిశీలిస్తే, పువ్వుల ఆకారంలో ఉన్న వివిధ కీటకాల చూపిస్తున్న AI వీడియోలను ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీ తరుచూ షేర్ చేయడం మనం గమనించవచ్చు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
తదుపరి, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు AI- ఉపయోగించి తయారు చేసినవా? లేదా? అని నిర్ధారించడానికి, Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి, ఈ వీడియోలో పలు క్లిప్‌లను పరిశీలించగా, ఈ వైరల్ దృశ్యాలు AI- జనరేటెడ్ అని Hive ఫలితాన్ని ఇచ్చింది.
ఇంతకుముందు కూడా ఈ ‘oleg.pars’ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయబడిన పలు వీడియోలు పువ్వు ఆకారంలో ఉన్న నిజమైన కీటకాలను చూపిస్తున్న దృశ్యాలు అంటూ వైరల్ కాగా, అవి AI-జనరేటెడ్ వీడియోలు అని చెప్తూ Factly పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
పువ్వుల ఆకారంలో ఉన్న కీటకాలు నిజంగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో వెతికితే, ఆర్చిడ్ మాంటిస్ (హైమెనోపస్ కరోనాటస్) orchid mantis (hymenopus coronatus), స్పైనీ ఫ్లవర్ మాంటిస్ (Spiny flower mantis) వంటి కొన్ని కీటకాలు చూడటానికి పువ్వుల ఆకారంలో ఉంటాయని తెలిసింది (ఇక్కడ & ఇక్కడ).
చివరగా, పువ్వుల ఆకారంలో ఉన్న వివిధ కీటకాలను చూపిస్తున్న ఈ దృశ్యాలు AI ఉపయోగించి సృష్టించబడ్డాయి.