జూన్ 2025లో ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇరాన్‌ పరిస్థితిని చూపిస్తున్న దృశ్యాలు అంటూ AI ద్వారా రూపొందించిన దృశ్యాలను షేర్ చేస్తున్నారు

జూన్ 2025లో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, “ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ దేశ పరిస్థితి” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జూన్ 2025లో ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇరాన్‌లో పరిస్థితిని చూపించే వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడింది. ఈ వీడియోలోని దృశ్యాలు, 13 జూన్ 2025న, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించడానికి కంటే ముందు నుండి ఇంటర్నెట్‌లో ఉన్నాయి. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలను మొదటగా ‘3amelyon’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మే 2025లో అప్‌లోడ్ చేయబడ్డాయి, ఈ పేజీలో ఇటువంటి చాలా AI-జనరేటెడ్ వీడియోలు ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, ఇందులోని దృశ్యాలు అసహజంగా ఉండటం మనం చూడవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో ఇటువంటి లోపాలు సహజంగానే ఉంటాయి (ఇక్కడఇక్కడ). అలాగే, పోస్ట్‌లో పేర్కొన్న దానికి విరుద్ధంగా, ఈ వీడియోలో ధ్వంసమై కనిపిస్తున్న విమానాలపై ఇజ్రాయెల్ కు సంబంధించిన జెండాలను, చిహ్నాలను మనం చూడవచ్చు.

ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోలో కనిపించే పలు దృశ్యాలను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) మే 2025లో ‘3amelyon’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు, 13 జూన్ 2025న, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించడానికి కంటే ముందు నుండి ఇంటర్నెట్‌లో ఉన్నాయిని తెలుస్తుంది. కావున జూన్ 2025లో ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ఈ దృశ్యాలకు ఎటువంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.

అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజీ బయోలో ఈ అరబిక్ భాషలో ఈ పేజీలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేస్తున్న తిరుగుబాటు’ అన్న అర్థం వచ్చే వాక్యం ఉంది. అలాగే, పాలస్తీనా ప్రస్తావన కూడా బయోలో రాసి ఉంది.  

తదుపరి ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు AI- ఉపయోగించి తయారు చేశారా? లేదా? అని నిర్ధారించడానికి, Cantilux వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్షన్ టూల్స్ ఉపయోగించి ఈ వీడియోను పరిశీలించగా, ఈ వైరల్ వీడియో 75% AI-జనరేటెడ్ కావచ్చని Cantilux ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు. 

చివరగా, జూన్ 2025లో ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇరాన్‌ పరిస్థితిని చూపిస్తున్న దృశ్యాలు అంటూ AI ద్వారా రూపొందించిన దృశ్యాలను షేర్ చేస్తున్నారు.