సముద్రంలో పడిపోయిన కంటైనర్ నుంచి కొందరు ఐఫోన్‌లను తీసుకుంటున్న నిజమైన దృశ్యాలని చెప్తూ ఒక AI-జనరేటెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు

ఒక కార్గో నౌక నుంచి ఐఫోన్ కంటైనర్ పడిపోయిందని క్లెయిమ్ చేస్తూ ఆ కంటైనర్ దగ్గరకు కొందరు ఒక పడవలో వెళ్లి ఆ ఐఫోన్‌లను తీసుకుంటున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: సముద్రంలో పడిపోయిన ఒక కంటైనర్ నుంచి కొందరు ఐఫోన్‌లను దొంగిలిస్తున్న నిజమైన సంఘటనకి చెందిన వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో, నిజమైన సంఘటనకు చెందిన దృశ్యాలు కావు. ఇది పూర్తిగా AI ఉపయోగించి తయారు చేసిన వీడియో అని AI కంటెంట్ డిటెక్షన్ టూల్స్ గుర్తించాయి.  కావున ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి ఇటీవల ఇటువంటి సంఘటన ఏదైనా జరిగిందా అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా, మాకు ఈ క్లెయిమ్‌కి మద్దతు ఇస్తూ ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు. 

ఆ తర్వాత, వైరల్ వీడియోను  మేము సరిగ్గా పరిశీలించగా, అందులో కనిపిస్తున్న వ్యక్తి చేతిలో అకస్మాతుగా ఫోన్ డబ్బా కనిపించడం, అతని చేతి వేళ్లు కొన్ని చోట్ల వింతగా కనిపించడం వంటి అవకతవకలను గుర్తించాము. ఇలాంటి అవకతవకలు, తప్పిదాలు సహజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియోలలో/ఇమేజీలలో సహజంగా కనిపిస్తూ ఉంటాయి. 

ఇదే విషయాన్ని నిర్ధారించుకోవడానికి, వైరల్ వీడియోను హైవ్ అనే AI-కంటెంట్ డిటెక్షన్ టూల్ ఉపయోగించి చూసాము. ఈ వీడియో పూర్తిగా AI-ఉపయోగించి తయారు చేసినదని హైవ్ గుర్తించింది. 

ఇక ఈ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం, అందులోని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, అ వీడియో యొక్క అసలు వెర్షన్ మాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లభించింది.

Oye_sanki_1 అనే పేజీలో ఈ వీడియోను 29 నవంబర్ 2025న అప్లోడ్ చేశారు. ఈ పేజీ యొక్క బయోలో ‘Experiments in Artificial Intelligence’ అని స్పష్టంగా రాసి ఉంది. అంటే ఈ పేజీలో ఉన్న వీడియోలో AI-జనరేటెడ్ అని మనకు దీనిబట్టి స్పష్టం అవుతుంది. ఈ వీడియోతో పాటు మరిన్ని ఇటువంటి AI-జనరేటెడ్ వీడియోలు, నిజమైన దృశ్యాలు అని చెప్తూ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ). ఇవన్నీ నిజమైన వీడియోలు కాదని చెప్తూ మేము ఒక ఫ్యాక్ట్ చెక్ కథనం ప్రచురించాము. 

చివరగా, సముద్రంలో పడిపోయిన కంటైనర్ నుంచి కొందరు ఐఫోన్‌లను తీసుకుంటున్న నిజమైన దృశ్యాలని చెప్తూ ఒక AI-జనరేట్ వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు