6000 సంవత్సరాల క్రితం సుమేరియన్లు తయారుచేసిన సౌర వ్యవస్థ మ్యాప్‌ అంటూ ఒక AI-జనరేటెడ్ ఫోటోను షేర్ చేస్తున్నారు

“ 6,000 సంవత్సరాల క్రితం, సుమేరియన్లు అని పిలువబడే ఒక రహస్యమైన నాగరికత మన సౌర వ్యవస్థ యొక్క వివరణాత్మక మ్యాప్‌లను కలిగి ఉంది. సుమేరియన్లు మట్టిని ఉపయోగించి ఈ చిత్రాలను రూపొందించారు” అని చెప్తూ ఉన్న ఫోటో కూడిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఇదే క్లెయిమ్ తో మరో ఫోటో కూడా కొన్ని పోస్టులో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ ఫోటోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 6000 సంవత్సరాల క్రితం సుమేరియన్లు తయారుచేసిన సౌర వ్యవస్థ యొక్క వివరణాత్మక మ్యాప్‌ను చూపిస్తున్న ఫోటోలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటోలు AI-జనరేటెడ్ (AI వాడి) తయారు చేసినవి. ఇవి AI-జనరేటెడ్ ఇమేజెస్ అని HIVE వంటి పలు AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్స్ స్పష్టం చేశాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, 6000 సంవత్సరాల క్రితం సుమేరియన్లు సౌర వ్యవస్థ యొక్క వివరణాత్మక మ్యాప్‌ను తయారుచేశారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇలాంటి ఒక మ్యాప్‌ను వారు తయారుచేశారు అని చెప్పే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. అయితే వారు మట్టితో పలకలు చేసి వాటి పై కొన్ని గుర్తుల ఉపయోగించి రాసినట్లు పలు రిపోర్టులు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

ఇకపోతే ఈ వైరల్ ఫోటోలను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇవి AI-జనరేటెడ్ ఫొటోలని అర్థమవుతుంది. తదుపరి మేము ఈ వైరల్ ఫోటోలు AI-జనరేటెడ్ ? లేదా ? అని నిర్ధారించడానికి, Hive అనే AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్ ని  ఉపయోగించి ఈ వైరల్ ఫోటోలను పరిశీలించగా, ఈ వైరల్ ఫోటోలు 99% AI-జనరేటెడ్ ఫొటోలు కావచ్చని ఫలితాలను ఇచ్చింది.

అలాగే Hugging Face అనే మరో AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్ ని  ఉపయోగించి ఈ వైరల్ ఫోటోలను పరిశీలించగా, మొదటి వైరల్ ఫోటో 96% మరియు రెండోవ వైరల్ ఫోటో 99% AI-జనరేటెడ్ ఫొటోలు కావచ్చని ఫలితాలను ఇచ్చింది. అలాగే ‘AI or Not’ వంటి పలు AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్స్ కూడా ఈ వైరల్ ఫోటోలు AI-జనరేటెడ్ ఫొటోలు అని స్పష్టం చేశాయి. దీన్ని బట్టి ఈ వైరల్ ఫోటోలు AI-టెక్నాలజీ ఉపయోగించి రూపొందిచారని మనం నిర్ధారించవచ్చు.    

చివరగా, 6000 సంవత్సరాల క్రితం సుమేరియన్లు తయారుచేసిన సౌర వ్యవస్థ యొక్క వివరణాత్మక మ్యాప్‌ అంటూ ఒక AI-జనరేటెడ్ ఫోటోను షేర్ చేస్తున్నారు.