‘అదానీ లాజిస్టిక్స్’ మరియు ఇతర ప్రైవేట్ కంపెనీలకు కంటైనర్ రైళ్లు నడపడానికి అనుమతులు యూపీఏ హయాంలోనే వచ్చాయి

YouTube Poster

మోడీ హయాంలో నా దేశం ఎంతో మార్పు చెందింది. ఒకప్పుడు రైళ్ల పై ఇండియన్ రైల్వే అని రాసుకునేది. కానీ ఇప్పుడు ఆధాని రైల్వే అని రాసుకుంటున్నారు’, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రైళ్ల పై ఇండియన్ రైల్వే అని ఉండాల్సింది, మోదీ హయాంలో అదానీ రైల్వే గా మారిపోయినట్టు వీడియోలో చూడవొచ్చు.

ఫాక్ట్: అదానీ పేరుతో ఉన్న రైళ్ల కంటైనర్ ఫోటోలు మరియు వీడియోలు 2014 లో మోదీ ప్రభుత్వం రాకముందు నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నాయి. ప్రైవేట్ సంస్థలకు కంటైనర్ రైళ్లు నడపడానికి అనుమతులు ఇచ్చే విధంగా భారత రైల్వే శాఖ 2006 లోనే రూల్స్ తీసుకొని వచ్చింది. ‘అదానీ లాజిస్టిక్స్’ కి కంటైనర్ రైళ్లు నడపడానికి అనుమతి 2007 లోనే వచ్చింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియోలో రైలు కంటైనర్ పై అదానీ పేరు ఉన్నట్టు చూడవొచ్చు. అయితే, అదానీ పేరుతో ఉన్న అలాంటి రైళ్ల కంటైనర్ ఫోటోలు మరియు వీడియోలు 2014 లో మోదీ ప్రభుత్వం రాకముందు నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నట్టు తెలిసింది. వాటిలో కొన్నిటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు. కాబట్టి, పోస్ట్ లో చెప్పినట్టు మోదీ హయాంలోకి వచ్చాక అదానీ పేరుతో రైల్వే కంటైనర్లు మొదలవలేదు.

ప్రైవేట్ సంస్థలకు కంటైనర్ రైళ్లు నడపడానికి అనుమతులు ఇచ్చే విధంగా భారత రైల్వే శాఖ 2006 లోనే ‘Indian Railways (Permission for Operators to Move Container Trains on Indian Railways) Rules, 2006’ ని తీసుకొని వచ్చింది. ఆ రూల్స్ ని ఇక్కడ చదవొచ్చు. కేవలం ‘అదానీ లాజిస్టిక్స్’ సంస్థ కే కాకుండా మరికొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా కంటైనర్ రైళ్ల ఆపరేషన్ అనుమతి ఇచ్చినట్టు 2009 సంవత్సరానికి సంబంధించిన రైల్వే డాక్యుమెంట్ లో చూడవొచ్చు. ‘అదానీ లాజిస్టిక్స్’ కి కంటైనర్ రైళ్ల ఆపరేషన్ అనుమతి వచ్చినట్టు ‘ది ఎకనామిక్ టైమ్స్’ వారు 2007 లో ప్రచురించిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. ప్రైవేట్ కంటైనర్ రైళ్ల ఆపరేషన్ కి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు. కాబట్టి, మోదీ ప్రభుత్వం రాకముందే ప్రైవేట్ కంటైనర్ రైళ్ల ఆపరేషన్ మొదలయ్యాయి.

పై లిస్టులోని కొన్ని సంస్థల వెబ్ సైట్లలో వారి పేర్లతో ఉన్న కంటైనర్ రైళ్ల ఫోటోలు ఉన్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ‘అదానీ లాజిస్టిక్స్’ మరియు ఇతర ప్రైవేట్ కంపెనీలకు కంటైనర్ రైళ్లు నడపడానికి అనుమతులు యూపీఏ హయాంలోనే వచ్చాయి.