2016 లో తీసిన వీడియోను పెట్టి, ప్రస్తుత లాక్ డౌన్ లో మసీద్ ను తెరవమని పోలీసులను బెదిరిస్తున్న వారిస్ పఠాన్ అని షేర్ చేస్తున్నారు

లాక్ డౌన్ లో మసీద్ ని తెరవాలని  బైకుళ్ళ (మహారాష్ట్ర) MLA వారిస్ పఠాన్ పోలీసులను బెదిరిస్తున్న వీడియో అని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియో లో వారిస్ పఠాన్  పోలీసులను మసీద్ ని మూయవద్దని మరియు ప్రజలను నమాజ్ చేసుకోవడానికి మసీద్ లోకి అనుమతించాలని అడుగుతున్నాడు. కానీ, ఆ వీడియోలోని సంఘటన 2016 లో జరిగింది అని FACTLY విశ్లేషణ లో తేలింది. ఒక మసీద్ లోని లౌడ్ స్పీకర్ నుండి వెలువడుతున్న శబ్దం గురించి బైకుళ్ళ (మహారాష్ట్ర) MLA వారిస్ పఠాన్ కి, అక్కడ స్థానిక పోలీసులకి వాగ్వివాదం ఏర్పడింది. అదే వీడియోని వారిస్ పఠాన్ కూడా  14 నవంబర్ 2016 న తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసాడు. అంతేకాక, వారిస్ పఠాన్ 2019 లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయాడు, ఇప్పుడు ఆయన బైకుళ్ళ నియోజక వర్గానికి MLA గా లేడు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. యూట్యూబ్ వీడియో – https://www.youtube.com/watch?v=KyIwTdE3HTE
2. వారిస్ పఠాన్ ఫేస్బుక్ పోస్ట్ – https://www.facebook.com/warispathanmla/videos/590189821170339/?v=590189821170339

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?