వీడియో లో కనిపిస్తున్న ఈ నిరసన అమెరికా లోని ఒహాయో స్టేట్‌హౌస్ దగ్గర జరిగింది, వైట్‌హౌస్ దగ్గర కాదు

అమెరికా లో ఆఫ్రికన్-అమెరికన్ జాతి కి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి  మెడ ఫై ఒక పోలీస్ తన మోకాలి తో గట్టిగా వత్తడంతో అతను ఊపిరి ఆడక చనిపోయిన విషయం తెలిసిందే. ఆ సంఘటనకు వ్యతిరేకంగా అమెరికా దేశం మొత్తం భారీ నిరసనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఫేస్ బుక్ లో ఒక వీడియోను షేర్ చేసి నిరసనకారులు వైట్‌హౌస్‌ (వాషింగ్టన్, డీసీ) లోకి దూసుకు వెళ్తున్న వీడియో అని ప్రచారం చేస్తున్నారు. అది వైట్ హౌస్ లోకి ఇలా దూసుకెళ్లడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: అమెరికాలో నిరసనకారులు వైట్ హౌస్ (వాషింగ్టన్, డీసీ) లోకి దూసుకు వెళ్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి మరణానికి నిరసనగా ఒహాయో స్టేట్‌హౌస్ దగ్గర నిరసన చేస్తున్నప్పటిది, వాషింగ్టన్, డీసీ లోని వైట్‌హౌస్‌ దగ్గర కాదు. కావున, పోస్టులోని క్లెయిమ్ తప్పు.

పోస్ట్ లోని వీడియో స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతికితే ఒహాయో స్టేట్‌హౌస్ దగ్గర జరుగుతున్న నిరసనల గురించి సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. ఆ సెర్చ్ రిజల్ట్స్ ని  ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. అందులో ఉన్న ఒహాయో స్టేట్‌హౌస్ ఫోటోలను, పోస్ట్ లోని  వీడియో లో ఉన్న భవనం తో పోల్చి చూస్తే, వీడియో లోని  భవనం ఒహాయో స్టేట్‌హౌస్ అని,  పోస్ట్ లో క్లెయిమ్ చేసినట్టు వైట్‌హౌస్‌ కాదని స్పష్టం అయింది. ‘Shutterstock’ ఫోటో లైబ్రరి లో ఒహాయో స్టేట్‌హౌస్ కి సంబంధించి ఉన్న  మరి కొన్ని ఫోటోలను  ఇక్కడ చూడవచ్చు. ఒహాయో స్టేట్‌హౌస్ దగ్గర జరిగిన నిరసనల గురించి రాసిన న్యూస్ రిపోర్ట్ ని ఇక్కడ చదవవచ్చు.

వైట్‌హౌస్‌ దగ్గర జరిగిన నిరసనల గురించి ఇంటర్నెట్ లో వెతకగా, వైట్‌హౌస్‌ గేట్ బయట వందల మంది నిరసనకారులు గుమిగూడారని మరియు US సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు  అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ ను భద్రత కోసం భూగర్భ బంకర్ల వద్దకు తీసుకెళ్లారని చెప్తూ  న్యూస్ రిపోర్ట్లు కనిపించాయి.

చివరగా, ఒహాయో స్టేట్‌హౌస్ పైన నిరసనకారులు దాడి జరుపుతున్న వీడియోని వైట్‌హౌస్‌ లోకి దూసుకెళ్తున్న నిరసనకారులు అని తప్పు ప్రచారం చేస్తున్నారు. 

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?