ఈ వీడియోలో ఒక వ్యక్తిని పోలీసులు చితక బాదుతున్నది మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో; ఉత్తరప్రదేశ్ లో కాదు

ఉత్తరప్రదేశ్ లో ఒక వ్యక్తిని పోలీసులు చితక బాదుతున్నారు అని చెప్తూ, ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, పోస్టులో చెప్పినట్టు వీడియోలోని ఘటన ఉత్తరప్రదేశ్ కి సంబంధించింది కాదని, మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో జరిగినట్టు FACTLY విశ్లేషణలో తేలింది. పోస్టులోని వీడియో వైరల్ అవ్వడంతో వీడియోలోని ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసారని, ఆ ఘటనపై దర్యాప్తు జరుపుతామని చింద్వారా ఎస్పీ వివేక్ అగర్వాల్ తెలిపినట్టు ‘హిందూస్తాన్ టైమ్స్’ ఆర్టికల్ లో చదవొచ్చు. కావున, పోస్టులో చెప్పినట్టు ఆ వీడియో ఉత్తరప్రదేశ్ లో తీసింది కాదు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. న్యూస్ ఆర్టికల్ – https://www.hindustantimes.com/india-news/cops-seen-thrashing-man-on-camera-in-madhya-pradesh-video-goes-viral/story-km6U8eTMoKWJTKM8nNwHOK.html
2. న్యూస్ ఆర్టికల్ – https://indianexpress.com/article/india/madhya-pradesh-video-of-police-assaulting-man-goes-viral-on-social-media-two-cops-suspended-6425261

Did you watch our new video?