కల్పితమైన నిధి తవ్వకాల వీడియోను నిజమైన సంఘటనగా ప్రచారం చేస్తున్నారు

తవ్వకాలలో బయటపడ్డ నిధిని రక్షిస్తూ వచ్చిన ఒక పాము ఎన్నో సంవత్సరాలుగా గాలి, నీరు, తిండి లేకుండా బ్రతికి ఉందని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

YouTube Poster

క్లెయిమ్: గాలి, నీరు, తిండి లేకుండా నిధిని రక్షిస్తూ వచ్చిన ఒక పాము తవ్వకాలలో బయటపడింది.

ఫ్యాక్ట్ (నిజం): వైరల్ అవుతున్న ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వీడియో “hazine avcısı” అనే యూట్యూబ్ ఛానెల్లో ఉంది. ఈ వీడియో కింద వివరణలో, “ ప్రదర్శించిన అన్ని దృశ్యాలు కల్పితమైనవి.అటెన్షన్, ఇదంతా కల్పితం.ఇది నిజం కాదు. అన్ని వీడియోలు కల్పితం. ప్రజలను అలరించడమే లక్ష్యం” అని ఉంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా పోస్టులో ఉన్న వీడియో యొక్క చిత్రాలను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, “Archaeologist” అనే యూట్యూబ్ ఛానెల్లో 18 జులై 2022లో  పోస్టు చేసిన ఈ వీడియో దొరికింది. వైరల్ అవుతున్న వీడియోని ఈ వీడియోతో పోల్చి చూడగా, రెండూ ఒకటే అని చెప్పొచ్చు.  

ఇక ఇదే యూట్యూబ్ ఛానెల్ కు సంబంధించిన వేరే ఛానెల్ కూడా ఉంది అని తెలిసింది. దాని పేరు “hazine avcısı”, అంటే టర్కిష్ భాషలో “నిధి వేటగాడు” అని అర్థం. ఈ ఛానెల్లో వైరల్ అవుతున్న వీడియోకి  సంబంధించిన పూర్తి వీడియో దొరికింది. దానిని ఇక్కడ చూడవచ్చు.

అయితే, ఈ వీడియో కింద వివరణలో వీడియోలో చూపించిన ఘటన కల్పితమైనవి పేర్కొంటూ ఈ విధంగా వివరణ ఇచ్చాడు:
గమనిక:  ప్రదర్శించిన అన్ని దృశ్యాలు కల్పితమైనవి.
అటెన్షన్, ఇదంతా కల్పితం.ఇది నిజం కాదు. అన్ని వీడియోలు కల్పితం. ప్రజలను అలరించడమే లక్ష్యం.”

చివరిగా, కల్పితమైన నిధి తవ్వకాల వీడియోను నిజమైన సంఘటనగా ప్రచారం చేస్తున్నారు.