బహామాస్‌లో మునిగిపోయిన క్రూజ్ బోట్ వీడియో టాంజానియాలో జరిగినట్లుగా షేర్ చేస్తున్నారు

“టాంజానియా సముద్రంలో మునిగిపోతున్న క్రూజ్ లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది” అంటూ మునుగుతున్న క్రూస్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది. దీని వెనుక ఉన్న వాస్తవం ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఇదే వీడియోను ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఇది టాంజానియా సముద్రంలో మునిగిపోతున్న క్రూజ్ యొక్క లైవ్ వీడియో.

ఫాక్ట్(నిజం):  ఈ సంఘటన 16 నవంబర్ 2023న బహామాస్‌లో జరిగింది, టాంజానియా సముద్రంలో కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ సంఘటనను వివరిస్తూ పలు మీడియా రిపోర్టులు ప్రచురించబడ్డాయి అని గమనించాం (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

ఈ వార్తా కథనాల ప్రకారం, ఈ సంఘటన 16 నవంబర్ 2023న బహామాస్‌లో జరిగింది. బ్లూ లగూన్ ద్వీపానికి పర్యాటకులను తీసుకువెళుతుండగా, నాసావులోని ప్యారడైజ్ ఐలాండ్ నుండి బయలుదేరిన పడవ మద్యలో మునిగింది. పడవలో ఉన్న కెల్లీ స్కిసెల్ అనే ఒక మహిళ ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 కెల్లీ స్కిసెల్ సోషల్ మీడియాను గమనించగా ఈ సంఘటన యొక్క ఫోటోలు మరియు వీడియోలు ‘బ్లూ లగూన్ ఐలాండ్‌కి వెళ్లే దారిలో మా ఫెర్రీ మునిగిపోయింది’ అనే టైటిల్‌తో షేర్ చేయడం గమనించాం. వైరల్ వీడియో మరియు ఒరిజినల్ వీడియోల మద్య పోలీకను కింద చూడవచ్చు.

చివరిగా, బహామాస్‌లో మునిగిపోతున్న క్రూజ్ బోట్ యొక్క వీడియో టాంజానియాలో జరిగినట్లుగా షేర్ చేస్తున్నారు.