ఇంగ్లాండ్‌లోని మెట్రోలో ఒక ముస్లిం వ్యక్తి పోర్టబుల్ టాయిలెట్ వాడి బహిరంగ మల విసర్జన చేస్తున్న దృశ్యాలు అని ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రాంక్ వీడియో షేర్ చేస్తున్నారు

YouTube Poster

అన్ని మతాలు సమానమే అని మానవతా దృక్పధం అని కుట్రతో శరణర్థులుగా వస్తామన్న తురకలకి స్వాగతం చెప్పి 1000కి అనుమతి ఉండగా లక్ష మంది ఇప్పుడు వచ్చి ఇంగ్లాండ్ దేశం మొత్తం మాదే అంటూ మెట్రో ట్రైన్ లో ప్యాంటు తీసి లెట్రిన్ కు కూర్చున్న తురకోడ్ని చూసి స్థానికులు సొంత దేశస్తులు బోగి ఖళీ చేసి వెళ్లే పరిస్థితి కి తెచ్చారు” అని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఒక రైలులో పోర్టబుల్ టాయిలెట్ వాడి బహిరంగ మల విసర్జన చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: ఇంగ్లాండ్‌లోని ఒక మెట్రోలో ఒక ముస్లిం వ్యక్తి పోర్టబుల్ టాయిలెట్ వాడి బహిరంగ మల విసర్జన చేస్తున్న దృశ్యాలు.

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో ‘Princezee’( ప్రిన్స్ జీ ) అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తయారు చేసిన ఒక ప్రాంక్ వీడియో. ఈ వ్యక్తి సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు, సోషల్ ఎక్సపరిమెంట్లని అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఈ వీడియోను తను అమెరికాలోని న్యూయార్క్ మెట్రోలో తీసాడు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలను వెరిఫై చేయడానికి వైరల్ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చెక్ చేస్తే ఈ వీడియో యొక్క ఒరిజినల్ వెర్షన్ మాకు. దీన్ని  ‘Princezee’( ప్రిన్స్ జీ ) అనే ఒక సోషల్ మీడియా వీడియో క్రియేటర్ 4 మే 2019న ఫేస్‌బుక్ మరియు ఇన్స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశాడు.ఈ వీడియో అమెరికాలోని న్యూ యార్క్ నగరంలో ఉన్న సబ్ వేలో తీశారని వీడియో యొక్క వివరణలో ఉంది. 

అసలు ఈ వీడియో నిజమైన సంఘటనదా లేదా స్క్రిప్టెడ్ వీడియోనా అని చెక్ చేయడానికి Prince Zee యొక్క సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్ చెక్ చేస్తే, అతను ప్రాంక్ వీడియోలు మరియు రకరకాల సోషల్ ఎక్సపీరిమెంట్లని తన యూట్యూబ్, ఫేస్‌బుక్ మరియు ఇన్స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తుంటాడు అని మాకు తెలిసింది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). అలాగే, ఒక పోర్టబుల్ టాయిలెట్ తీసుకొని రకరకాల పబ్లిక్ ప్లేసుల్లో వాడినట్లు ఇతను ఒక వీడియో యూట్యూబులో అప్లోడ్ చేశాడు

వైరల్ వీడియోలో లాగనే, సబ్ వేలో స్నానం చేస్తున్నట్టు, బెడ్ వేసుకుని నిద్రపోతున్నట్లు ఇలా రకరకాల కాన్సెప్టులతో Prince Zee వీడియోలు చేసి అప్లోడ్ చేశాడు. వాటిని మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

అలాగే, వైరల్ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టుగా నిజంగానే ఇలా ఒక ముస్లిం వ్యక్తి ఇంగ్లాండ్‌లోని మెట్రోలో బహిరంగంగా మల విసర్జన చేసిన సంఘటన ఏదైనా ఇటీవల జరిగిందా అని ఇంటర్నెట్లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతికాము. దీనికి సంబంధించి ఎక్కడా కచ్చితమైన ఆధారాలు లభించలేదు .

చివరిగా, ఇంగ్లాండ్‌లోని మెట్రోలో ఒక ముస్లిం వ్యక్తి పోర్టబుల్ టాయిలెట్ వాడి బహిరంగ మల విసర్జన చేస్తున్న దృశ్యాలు అని ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చేసిన ప్రాంక్ వీడియోని షేర్ చేస్తున్నారు.