ఒక రోడ్డుపైన ఇద్దరు వ్యక్తులు గాయాలతో పడిపోయినట్లు నటిస్తూ, వీరికి సహాయం చేయడానికి ఆగిన మరో ఇద్దరిని కొట్టి, వారి బైక్ దొంగిలించిన సీసీటీవీ విజువల్స్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘రాత్రి పూట ఎవరిని అయ్యో పాపం అనరాదు… ముఖ్యంగా ఫ్యామిలీతో వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్తూ ఈ వీడియోని సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: రోడ్డు పైన గాయాలై పడిపోయినట్లు నటిస్తూ, వారికి సహాయం చేయడానికి వచ్చిన ఇద్దరు బైకర్లను కొట్టి వారి బైకును దొంగిలించిన సంఘటన యొక్క నిజమైన వీడియో.
ఫాక్ట్: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటన కాదు. దీన్ని ఫిక్షనల్ వీడియోలు అప్లోడ్ చేసే ‘K94 Studio Space’ అనే ఫేస్‌బుక్ వారు తయారు చేశారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా, మాకు ఈ వీడియో ‘K94 Studio Space’ అనే ఫేస్‌బుక్ పేజీలో లభించింది. దీన్ని వారు 15 సెప్టెంబర్ 2025న ‘Real Evidence Captured on Security Cam…’ అనే వివరణతో షేర్ చేశారు.
ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్‌లో ‘K94 Studio Space’ వారు కామెంట్ చేస్తూ, ఇది ఒక ఫిక్షనల్ వీడియో అని, నిజంగా జరిగిన సంఘటన కాదని చెప్పారు. ఈ వీడియోను వారు ప్రజల్లో అవగాహన కలుగ చేయడానికి తయారు చేశారని, వారు ఈ కామెంట్ ద్వారా తెలియ చేశారు.
K94 Studio Space వారి పేజీ బయోలో ‘Digital Creator’ అని రాసి ఉంది. ఈ పేజీలో ఇటువంటి చాలా స్క్రిప్టెడ్, ఫిక్షనల్ వీడియోలు ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
అదనంగా, K94 వారిదే ‘K94 Mix’ అనే ఫేస్‌బుక్ పేజీలో ఇటువంటి స్క్రిప్టెడ్ వీడియోలు (ఇక్కడ, ఇక్కడ) చాలా ఉన్నాయి. ఇందులో కూడా వైరల్ వీడియో అసలు వెర్షన్‌ను, ఇది స్క్రిప్టెడ్ వీడియో అనే వివరణతో వారు అప్లోడ్ చేశారు.
చివరగా, ఇద్దరు వ్యక్తులు గాయాలతో పడి ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ, దొంగతనికి గురైన నిజమైన సంఘటన అని చెప్తూ, ఒక స్క్రిప్టెడ్ వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు.