పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో, మరియం నవాజ్ క్యాబినెట్లో విద్యా మంత్రి రాణా సికందర్ హయత్ పంజాబ్‌లోని ఒక జంట ఇంట్లోకి చొరబడి ఒక మహిళను బట్టలు విప్పి కెమెరా ముందు అత్యాచారం చేశారని క్లెయిమ్ చేస్తున్న ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో, విద్యా మంత్రి రాణా సికందర్ హయత్ పంజాబ్‌లోని ఒక జంట ఇంట్లోకి చొరబడి ఒక మహిళపై లైంగిక దాడి చేస్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): వైరల్ వీడియోలో జంటపై లైంగిక దాడి చేస్తున్నట్లు కనిపిస్తున్న వ్యక్తి పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ విద్యా మంత్రి రాణా సికందర్ హయత్ కాదు. వార్తా కథనాల ప్రకారం, ఇతని పేరు ఉస్మాన్ మీర్జా. ఈ దాడి చేసినందుకు ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సికందర్ హయత్‌కు సంబంధం లేదు. కాబట్టి, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్‌ను వెరిఫై చేయడానికి, వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్‌లను ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ARY న్యూస్ వారి యూట్యూబ్ ఛానెల్‌లో 30 సెప్టెంబర్ 2021న అప్లోడ్ చేసిన ఒక వీడియో వార్తా కథనం మాకు లభించింది. ఈ కథనంలో, వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ సంఘటన ఇస్లామాబాద్‌లో జరిగింది అని, ఇందులో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఉస్మాన్ మిర్జా అని ఇందులో చెప్పారు. ఇలా చేసినందుకు ఉస్మాన్ మిర్జాతో పాటు మరో ఏడుగుని పోలీసులు కేసు నమోదు చేశారని అని ఈ కథనంలో తెలిపారు.
దీనిపై మరిన్ని వివరాల కోసం ఇంటర్నెట్లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఈ సంఘటనపై జూలై 2021లో ప్రచురితమైన వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ వార్తా కథానాల ప్రకారం, ఈ సంఘటన 06 జూలై 2021న ఇస్లామాబాద్‌లోని గోల్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ E-11/2లోని ఒక అపార్ట్‌మెంట్ భవనంలో జరిగింది.
ఈ సంఘటన జరిగినప్పుడు, ఒక ఐదు నుండి ఆరుగురు పురుషుల గుంపు, బాధితులను తుపాకీ పట్టుకుని బెదిరిస్తూ కస్టడీలో పెట్టుకున్నారని ఈ కథనాల్లో పేర్కొన్నారు. నిందితులు వారిని బెదిరిస్తూ బట్టలు కూడా విప్పారు. ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులని అరెస్ట్ చేశారు.
ఇంకా, ఈ సంఘటనపై మార్చి 2022లో వచ్చిన వార్తా కథనాల (ఇక్కడ, ఇక్కడ) ప్రకారం. 25 మార్చి 2022న, ఇస్లామాబాద్‌లోని సెషన్స్ కోర్టు, ఈ జంటపై చేసిన లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు ఉస్మాన్ మీర్జాతో సహా ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా వారికి ఒక్కొక్కరికి రూ. 2,00,000 జరిమానా విధించబడింది.
అదనంగా, పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ యొక్క విద్యా శాఖ మంత్రి రానా సికందర్ హయత్ (ఇక్కడ, ఇక్కడ), క్లెయిములో చెప్తున్న విధంగా ఒక జంటపై దాడి చేశారా అని తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు దొరకలేదు.
చివరగా, జూలై 2021లో ఇస్లామాబాద్‌లో ఉస్మాన్ మీర్జా అనే వ్యక్తి ఒక జంటపై దాడి చేసిన వీడియోని పాకిస్తాన్ మంత్రి రాణా సికందర్ హయత్‌కి ఆపాదిస్తూ తప్పుడు ప్రచారం జరుగుతోంది.