సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో లడ్డూ విక్రయ టెండర్‌ను హిందూ వ్యక్తికే కేటాయించారు

“సిరిసిల్ల పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం కార్యక్రమంలో లడ్డు అమ్మకం టెండర్ ముస్లింకి ఇచ్చారట, మన హిందూ సోదరులు అక్కడి వెళ్లి దేవస్థాన అధికారిని నిలదీసి అడుగుతున్న దృశ్యాలు” అని చెప్తూ వీడియోతో కూడిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో లడ్డూ విక్రయ టెండర్‌ను ముస్లింకు ఇచ్చారు.

ఫాక్ట్(నిజం): ఇదే విషయంపై Factly సిరిసిల్ల జిల్లా దేవాదాయ – ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ను సంప్రదించగా, Factlyతో మాట్లాడుతూ అసిస్టెంట్ కమిషనర్ గారు ఈ పోస్టులో ఎలాంటి వాస్తవం లేదని, సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో లడ్డూ విక్రయ టెండర్‌ను పులి మల్లేశం అనే హిందూ వ్యక్తికి కేటాయించారని తెలిపారు. లడ్డూ కంట్రాక్ట్ దక్కించుకున్న సదరు వ్యక్తి ఓ ముస్లిం వ్యక్తిని లడ్డూ తయారీ తరువాత వంట పాత్రలను శుభ్రం చేసే పనిలోకి తీసుకున్నాడని, లడ్డూ విక్రయ కేంద్రం వద్ద ఈ ముస్లిం వ్యక్తి యొక్క UPI స్కానర్ కు కొందరు భక్తులు లడ్డూలు కొనగోలు చేసి ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయగా, వారికి ముస్లిం పేరు వచ్చింది, దీంతో ఈ వివాదం తలెత్తిందని, లడ్డూ తయారీలో ముస్లిం వ్యక్తులు ఎవరూ పాల్గొన లేదని మరియు లడ్డూ తయారీ గుడి ఆవరణలోనే జరిగిందని తెలిపారు. అలాగే ఈ లడ్డూ టెండర్‌ కేటాయింపుకు సంబంధించిన వేలం పాటకు ప్రక్రియ యొక్క అధికారిక ప్రొసీడింగ్స్ ప్రతులను, తుది కేటాయింపుకు సంబంధించిన అధికారిక డాక్యుమెంట్స్ కూడా Factlyకి షేర్ చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో లడ్డూ విక్రయ టెండర్‌ను ముస్లింకు ఇచ్చారా? అని తెలుసుకోవడానికి మేము ముందుగా సిరిసిల్ల జిల్లా దేవాదాయ – ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ను సంప్రదించగా, దేవాదాయ – ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ గారు Factlyతో మాట్లాడుతూ, ఈ పోస్టులో ఎలాంటి వాస్తవం లేదని, సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో లడ్డూ విక్రయ టెండర్‌ను పులి మల్లేశం అనే హిందూ వ్యక్తికి కేటాయించారని, లడ్డూ కంట్రాక్ట్ దక్కించుకున్న సదరు వ్యక్తి ఓ ముస్లిం వ్యక్తిని లడ్డూ తయారీ తరువాత వంట పాత్రలను శుభ్రం చేసే పనిలోకి తీసుకున్నాడని అని తెలిపారు. లడ్డూ విక్రయ కేంద్ర వద్ద ఈ ముస్లిం వ్యక్తి యొక్క UPI స్కానర్ కు కొందరు భక్తులు లడ్డూలు కొనగోలు చేసి ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయగా, వారికి ముస్లిం పేరు వచ్చింది, దీంతో ఈ వివాదం తలెత్తిందని, లడ్డూ తయారీలో ముస్లిం వ్యక్తులు ఎవరూ పాల్గొన లేదని మరియు లడ్డూ తయారీ గుడి ఆవరణలోనే జరిగిందని తెలిపారు.   

అలాగే దేవాదాయ – ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ గారు మాకు ఈ లడ్డూ టెండర్‌ కేటాయింపుకు సంబంధించిన వేలం పాటకు ప్రక్రియ యొక్క అధికారిక ప్రొసీడింగ్స్ ప్రతులను మరియు తుది కేటాయింపుకు సంబంధించిన అధికారిక డాక్యుమెంట్స్ (ప్రతులను) కూడా షేర్ చేసారు. ఈ డాక్యుమెంట్స్ ప్రకారం, సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో లడ్డూ విక్రయ కోసం టెండర్‌లు పిలవగా మొత్తం ఏడుగురు (07) వ్యక్తులు పాల్గొన్నారు. ఇందులో అందరి కన్నా ఎక్కువ మొత్తానికి టెండర్ వేసిన పులి మల్లేశం S/O: ఐలయ్య కి టెండర్ కేటాయించడం జరిగింది అని తెలుస్తుంది. దీన్ని బట్టి సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో లడ్డూ విక్రయ టెండర్‌ను ముస్లిం మతానికి చెందిన వ్యక్తికి ఇవ్వలేదని మనం నిర్థారించవచ్చు.  

అలాగే ఈ వివాదంపై సిరిసిల్ల శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్లు సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి లడ్డూ విక్రయ టెండర్‌ను ముస్లిం మతానికి చెందిన వ్యక్తికి ఇవ్వలేదని, టెండర్‌ను పులి మల్లేశం అనే హిందూ మతానికి చెందిన వ్యక్తికి ఇచ్చారని స్పష్టం చేశారు (ఇక్కడ, ఇక్కడ).   

చివరగా, సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో లడ్డూ విక్రయ టెండర్‌ను పులి మల్లేశం అనే హిందూ మతానికి చెందిన వ్యక్తికి కేటాయించారు.