వెబ్ సీరీస్ లోని క్లిప్ పెట్టి, ‘లాక్ డౌన్ కారణంగా దేవాలయంలో పూజలు చేయొద్దని అన్నందుకు ఒక పోలీస్ అధికారిని కొట్టారు’ అని ప్రచారం చేస్తున్నారు

ఒక వీడియోని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ఒక పోలీస్ అధికారి లాక్ డౌన్ కారణంగా దేవాలయంలో పూజలు చేయొద్దని అన్నందుకు అతన్ని కొట్టారని చెప్తున్నారు. కానీ, ‘FACTLY’ పరిశీలనలో ఆ వీడియో ఒక వెబ్ సీరీస్ లో నుండి తీసుకోబడింది అని తేలింది. పూర్తి వీడియో ని ‘కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (CWE)’ అనే యూట్యూబ్ ఛానెల్ లో 18 జూన్ 2019న అప్లోడ్ చేసినట్లుగా చూడవచ్చు. CWE అనేది ఒక రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ; దానిని WWE రెజ్లర్ ‘ది గ్రేట్ ఖాలీ’ ప్రారంభించారు. కావున, పోస్టు లోని క్లిప్ వాస్తవ ఘటనది కాదు, అది ఒక వెబ్ సిరీస్ లోనిది.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. యూట్యూబ్ వీడియో – https://www.youtube.com/watch?v=c3bFrAooH84 2. CWE గురించి వీడియో – https://www.youtube.com/watch?v=jca3mFhWfHE&feature=youtu.be

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?