లిస్ట్ లోనివి మాజీ చైనీస్ ఆర్మీ జనరల్స్ పేర్లు; గల్వాన్ వ్యాలీ ఘటనలో చనిపోయిన చైనా సైనికులవి కాదు

చైనా ప్రభుత్వం తమ సైనికులు 56 మంది మృతి చెందినట్లుగా ప్రకటించిందనే వార్త తో పాటూ 56 మంది పేర్లతో ఉన్న ఒక లిస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది పోస్టు చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చైనా ప్రభుత్వం తమ సైనికులు 56 మంది మృతి చెందినట్లుగా ప్రకటించింది.  లిస్ట్ లోని పేర్లు మృతి చెందిన 56 మందివి. 

ఫాక్ట్ (నిజం): ): చైనా ప్రభుత్వం తమ సైనికులు ఎంతమంది చనిపోయారనే సమాచారం ఈ ఆర్టికల్ రాసే సమయానికి ఇంకా విడుదల చేయలేదు. అంతేకాదు, పోస్టులోని లిస్ట్ లో ఉన్న పేర్లు ‘వికీపీడియా’ లో చైనీస్ మాజీ ఆర్మీ జనరల్స్ కి సంబంధించిన పేజ్ నుండి తీసుకోబడ్డాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

భారత్ మరియు చైనా సైన్యాల మధ్య 15 జూన్ 2020న గాల్వాన్ వ్యాలీ లో ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణల్లో సుమారు ఇరవై మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారని భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ, చైనా ప్రభుత్వం తమ సైనికులు ఎంతమంది చనిపోయారనే సమాచారం ఈ ఆర్టికల్ రాసే సమయం వరకైతే విడుదల చేయలేదు. చైనా దేశానికి చెందిన ‘Global Times’ వార్తా పత్రిక యొక్క ఎడిటర్-ఇన్-చీఫ్ ‘హు క్సుజిన్’ కూడా ఒక ట్వీట్ లో తమ ప్రభుత్వం ఎంతమంది చైనా సైనికులు చనిపోయారని వెల్లడించలేదని తెలిపారు. కావున, చైనా ప్రభుత్వం తమ సైనికులు 56 మంది మృతి చెందినట్లుగా ప్రకటించిందనేది తప్పు.

అంతేకాదు, పోస్టులోని లిస్ట్ లోని పేర్లను గూగుల్ లో వెతికినప్పుడు, ఆ లిస్ట్ లోని పేర్లు ‘వికీపీడియా’ లో ‘List of generals of the People’s Republic of China’ అనే టాపిక్ మీద ఉన్న పేజ్ లో చూడవచ్చు. ఆ లిస్ట్ లోని కొందరు మాజీ జనరల్స్ ఎప్పుడో చనిపోయరు. కావున, ఈ లిస్ట్ కి గాల్వాన్ వ్యాలీ లో జరిగిన ఘర్షణలలో పాల్గొన్న వారికి సంబంధం లేదు.

చివరిగా, 19 జూన్ 2020 వరకైతే చైనా ప్రభుత్వం తమ సైనికులు ఎంతమంది చనిపోయారనే సమాచారం విడుదల చేయలేదు, మరియు పోస్టు లోని లిస్ట్ లో ఉన్న పేర్లు వికీపీడియాలోని చైనీస్ మాజీ ఆర్మీ జనరల్స్ లిస్ట్ నుండి తీసుకోబడినవి.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?