2019 దసరా పండగ సందర్బంలో తీసిన వీడియోని అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి సంబంధించిన సంబరాలంటూ షేర్ చేస్తున్నారు

ఆగస్ట్ 5న అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు మొదలవుతున్న నేపథ్యంలో సీతమ్మ వేషం ధరించి ఆనందంతో చిందులేస్తున్న చిన్నారి, అంటూ షేర్ చేస్తున్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: అయోధ్యలోని రామ మందిర నిర్మాణ పనులు మొదలవుతున్న ఆనందంలో సీతమ్మ వేషం ధరించి చిందులేస్తున్న చిన్నారి వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో సీతమ్మ వేషంలో ఉన్న చిన్నారి, చిందులేస్తున్నది అయోధ్యలోని రామ మందిర నిర్మాణ పనులు మొదలవుతున్నందుకు కాదు, 2019 దసరా పండగ సందర్బంలో. కావున పోస్ట్ ద్వారా చెప్తున్నది తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షోట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే వీడియోని షేర్ చేస్తూ ‘The Indian Express’ వారు రాసిన ఒక ఆర్టికల్ దొరికింది. ఈ ఆర్టికల్ లో ఆ వీడియో 2019 అక్టోబర్లో దసరా పండగ సందర్భంలో తీసిన వీడియో అని తెలిపారు. పోస్టులోని వీడియోని షేర్ చేస్తూ ‘CNN-News18’ వారు మరియు ‘Mumbai mirror’ రాసిన ఆర్టికల్స్ లో కూడా ఇదే విషయం తెలిపారు. ఆ ఆర్టికల్స్ మనం ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియో ఎక్కడ తీసిన విషయానికి సంబంధించింది ఎలాంటి వివరణ ఈ ఆర్టికల్స్ లో తెలుపలేదు.

పోస్టులోని అదే వీడియోని అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు తర్వాత చేసుకున్న సంబరాలుగా షేర్ చేసినప్పుడు, Factly రాసిన ఫాక్ట్ చెక్ ఆర్టికల్ ఇక్కడ చదవొచ్చు.

చివరగా, 2019 దసరా పండగ సందర్బంలో తీసిన వీడియోని చూపిస్తూ అయోధ్యలోని రామ మందిర నిర్మాణం ప్రారంభానికి సంబంధించిన సంబరాలని షేర్ చేస్తున్నారు.