పాత వీడియోని చూపిస్తూ ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా సమయంలో దయనీయ పరిస్థితులు ఇవి అంటూ షేర్ చేస్తున్నారు

కరోన వైరస్ కేసులు తెలంగాణాలో  పెరుగుతున్న నేపథ్యంలో  హైదరాబాద్ లోని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా సమయంలో దయనీయ పరిస్థితులు ఇవి అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టులో షేర్ చేసిన వీడియోలోని అవే దృశ్యాలు కలిగి ఉన్న ఒక  వీడియో యూట్యూబ్ లో నవంబర్ 2018 నుంచే ఉనట్టు విశ్లేషణలో తెలిసింది. కావున, ఆ వీడియో పాతది. ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కలు తిరుగుతున్నాయి అని కరోన వైరస్ కన్నా ముందు నుంచే సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో కుక్కల సంచరిస్తున్నాయని ‘Headlines Today’ వారు 2015లో, ‘The Times of India’ వారు 2018లో కథనాలు రాసారు. అలాగే, ఈ విషయానికి సంబంధించి పలు న్యూస్ వెబ్సైట్ లలో కూడా పాత  ఆర్టికల్స్ కనిపించాయి. అవి ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఉస్మానియా ఆసుపత్రిలో కుక్కలు సంచరిస్తున్నాయి అని గతంలో చాలా కథనాలు వచ్చిన మాట నిజమే అయినప్పటికీ, పోస్ట్ లో షేర్ చేసిన వీడియోకి, కరోనా కి ఎటువంటి సంబంధం లేదు.  2018లో పోస్ట్ చేసిన వీడియో ని చూపించి కరోన నేపథ్యంలో ఉస్మానియా ఆసుపత్రిలో పరిస్థితి ఇది, అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. పాత 2018 వీడియో – https://www.youtube.com/watch?v=y77dn1VwYUY
2. ‘Headlines Today’ వీడియో –
https://www.youtube.com/watch?v=N7nZ8nHUKZ0
3. ‘The Times of India’ వీడియో –
https://www.youtube.com/watch?v=6AsV_Aq6JeM&t=57s
4. ‘Deccan Chronicle’ ఆర్టికల్ – https://www.deccanchronicle.com/nation/current-affairs/190117/hyderabad-its-raining-cats-dogs-at-osmania-general-hospital.html

Did you watch our new video?