Fake News, Telugu
 

2013 కుంభమేళాకి సంబంధించిన ఫోటోని రైతుల నిరసనలకు ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు

0

చాలా పెద్ద ఎత్తున టెంట్స్ వేసిన ఉన్న ఒక ఫోటోని చూపిస్తూ ఈ ఫోటోలో కనిపిస్తున్న టెంట్స్ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులు సింఘు బోర్డర్ లో నిర్మించినవని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులు సింఘు బోర్డర్ లో చాలా పెద్ద ఎత్తున టెంట్స్ వేసారు.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో 2013లో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో జరిగిన కుంభమేళాలో తీసింది. ఈ ఫోటోకి కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న రైతుల నిరసనలకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ ఫోటో 2013లో అలహాబాద్ లో జరిగిన కుంభమేళాకి సంబంధించినట్టుగా ఉంది.

ఐతే ఇన్విడ్ టూల్ ద్వారా ఈ ఫోటోకి సంబంధించిన EXIF వివరాలు తెలుసుకోగా, ఈ ఫోటో 2013లో జరిగిన కుంభమేళాలో తీసినట్టుగా తెలుస్తుంది.

పైన తెలిసిన వివరాల ఆధారంగా గూగుల్ లో వెతకగా పోస్టులోని ఫోటోని పోలిన ఒక ఫోటో అలామి వెబ్సైటు లో కనిపించింది, అలామిలో ఉన్న ఈ ఫోటో పోస్టులోని ఫోటోలో ఉన్న ప్రదేశాన్ని వేరే సమయంలో తీసినట్టు తెలుస్తుంది. రెండు ఫోటోలను పోల్చి చూస్తే చాలా సారూప్యతలు కనిపిస్తాయి. ఐతే అలామి వెబ్సైటు లో ఈ ఫోటోకి సంబంధించి ఇచ్చిన వివరణ ప్రకారం ఈ ఫోటో 2013లో అలహాబాద్ లో జరిగిన కుంభమేళాలో తీసినట్టుగా తెలుస్తుంది. 2013లో అలహాబాద్ లో జరిగిన కుంభమేళాకి సంబంధించిన మరిన్ని ఫోటోలు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి ఆధారంగా ఈ ఫోటో ఇప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ బోర్డర్ వద్ద నిరవహిస్తున్న ఆందోళనలకు సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

కొత్త వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న నేపధ్యం ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. నిరసనలకు సంబంధించి రైతులు ఢిల్లీ బోర్డర్ దగ్గర వేసిన టెంట్స్ ఫోటోలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

చివరగా, 2013లో అలహాబాద్ లో జరిగిన కుంభమేళాకి సంబంధించిన ఫోటోని కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులు సింఘు బోర్డర్ లో పెద్ద ఎత్తున టెంట్స్ వేశారని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll