2006 ఫోటోని, తాజాగా కరాచీలో జరిగిన దాడులలో ధ్వంసం అయిన సైనిక వాహనం అని షేర్ చేస్తున్నారు

ఫేస్బుక్ లో ఒక ఫోటోని పోస్టు చేసి, ‘ఈరోజు పాకిస్థాన్ సైనిక వాహనంపై సింధూదేశ్ లిబరల్ ఆర్మీ దాడి చేసిన ద్రృశ్యం’ అని ఆ ఫోటో గురించి చెప్తున్నారు. ఆ ఫోటోని ఈ రోజు (19 జూన్ 2020) పాకిస్తాన్ లోని కరాచీ లో భద్రత దళాలపై జరిగిన దాడుల సందర్భంగా షేర్ చేస్తున్నారు. అయితే, పోస్టు లోని పాతదని FACTLY విశ్లేషణ లో తెలిసింది. ఆ ఫోటో ని 15 డిసెంబర్ 2006 న తీసినట్లుగా ‘Adobe Stock’ ఫోటో లైబ్రరీ లో దాని గురించి ఉన్న వివరణ  ద్వారా తెలుస్తుంది. కరాచీలో ఒక సమ్మె సందర్భంగా నిరసనకారులు పారామిలిటరీ వాహనం పై రాళ్ళు విసరడంతో, వారి నుండి భద్రతా సిబ్బంది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తీసిన ఫోటో అది. ‘పష్టూన్ యాక్షన్ కమిటీ’ కి చెందిన రవాణా కార్మికులు స్థానిక ఛార్జీలను పెంచాలని మరియు ఇంధన ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్లతో సమ్మెకు దిగినట్లుగా ఫోటో కింద ఉన్న వివరణ లో చదవొచ్చు. కావున ఫోటో పాతది. దానికీ, తాజాగా కరాచీలో జరిగిన దాడులకు సంబంధం లేదు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. ‘Adobe Stock’ ఫోటో లైబ్రరీ వెబ్సైట్ – https://stock.adobe.com/in/146969577

Did you watch our new video?