ఫ్రాన్స్ లో కొరోనా వైరస్ వల్ల మార్చి 15న 36 మంది చనిపోయారు.

ఫ్రాన్స్ లో కొరోనా వైరస్ వల్ల ఒక్క మార్చి 15 రోజునే 2000 మంది చనిపోయారని కొంతమంది ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉందో  పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫ్రాన్స్ లో కొరోనా వైరస్ వల్ల మార్చి 15న 2000 మంది చనిపోయారు.

ఫాక్ట్ (నిజం): ఫ్రాన్స్ లో కొరోనా వైరస్ వల్ల మార్చి 15న 36 మంది చనిపోయారు. అసలు ఆ దేశం లో కొరోనా వైరస్ వల్ల మార్చి 17 వరకు మొత్తంగా మరణించిన వారి సంఖ్యే ‘175’. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఫేస్బుక్ లో ఒక యూజర్ మార్చి16 న ఫ్రాన్స్ లో కొరోనా వైరస్ వల్ల నిన్న ఒక్క రోజున (మార్చి15 న) 2000 మంది చనిపోయారని పోస్టు చేసాడు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెబ్సైటు లో ఉన్న తాజా సమాచారం (మార్చి 17, 2020 రిపోర్ట్ ) ప్రకారం, ఫ్రాన్స్ లో కొరోనా వైరస్ వల్ల మరణించిన వారి మొత్తం సంఖ్య ‘148’. అందులో కొత్తగా మరణించిన వారి సంఖ్య 21, అంటే మార్చ్ 16న మరణించిన వారి సంఖ్య 21 అన్నమాట. ఆరోగ్య సంస్థ (WHO) మార్చి 16న రిలీజ్ చేసిన రిపోర్ట్ చూస్తే అందులో కొత్తగా మరణించిన వారి సంఖ్య 36 అని తెలుస్తుంది.

చివరగా, ఫ్రాన్స్ లో కొరోనా వైరస్ వల్ల మార్చి 15న 36 మంది చనిపోయారు. అసలు ఆ దేశం లో కొరోనా వైరస్ వల్ల మార్చి 17 వరకు మొత్తంగా మరణించిన వారి సంఖ్యే ‘148’.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?