NHM ఉద్యోగుల పాత నిరసన వీడియోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక నిరసనగా షేర్ చేస్తున్నారు

Saringar. #do or #die కాశ్మీర్ లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాశ్మీర్ ప్రజలు నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టారు‘ అంటూ ఆర్టికల్ 370 రద్దు తరువాత సోషల్ మీడియా లో కొంత మంది పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. అసలు ఆ నిరసన నిజంగా ఆర్టికల్ 370 రద్దు తరువాత జరిగిందో లేదో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాశ్మీర్ లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలుమొదలుపెట్టిన
కాశ్మీర్ ప్రజలు.

ఫాక్ట్ (నిజం): ఫిబ్రవరి నెలలో ఉద్యోగాలను క్రమబద్దీకరణ చేయాలంటూ నిరసన చేసిన వీడియో ను మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక నిరసనగా ఆర్టికల్ 370 రద్దు తరువాత షేర్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.   

వీడియోని జాగ్రత్తగా గమనిస్తే, 0:27 సమయం దగ్గర నిరసన చేసే వ్యక్తులు పట్టుకున్న బ్యానర్ పైన ‘EMPLOYEES’ అని రాసినట్టు చూడవచ్చు.అలానే 1:10 సమయం దగ్గర ‘SRINAGAR POLICE’ అని బారికేడ్ పైన ఉంటుంది.

గూగుల్ లో ‘Employees rally in Srinagar’ అని వెతికితే పోస్ట్ లో పెట్టిన వీడియో ఫిబ్రవరి నెలలో అప్లోడ్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వీడియో క్రింద రాసిన వివరణ చూస్తే అది నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులు ర్యాలీ చేపడితే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు అడ్డుకుంటున్న వీడియో అని ఉంటుంది. ఇదే వివరణ తో యూట్యూబ్ లో వెతికితే ఈ ఘటనకు సంబంధించి ఫిబ్రవరి నెలలోపెట్టిన వీడియో దొరుకుతుంది.

ఈ నిరసనకు సంబంధించిన ఆర్టికల్ కూడా ‘గ్రేటర్ కాశ్మీర్’ వెబ్సైటు లో ఫిబ్రవరి లో పెట్టినట్టు చూడవొచ్చు.

కావున ఫిబ్రవరి నెలలో ఎన్ హెచ్ ఎమ్ ఉద్యోగుల చేపట్టిన నిరసన వీడియోని ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక నిరసనగా చేస్తునట్టు ఆర్టికల్ 370 రద్దు తరువాత షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?