B17/ Laetrile/Amygdalin తో క్యాన్సర్ నయం అవుతుందని అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు

క్యాన్సర్ అనేది వ్యాధి కాదు, కేవలం ఒక విటమిన్ లోపమేనని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో ఇరవై నాలుగు వేల మందికి పైగా షేర్ చేసారు. పోస్ట్ లో చెప్పిన విషయాల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

Claim: క్యాన్సర్ అనేది వ్యాధి కాదు. అది కేవలం B17 విటమిన్ లోపం మాత్రమే. కావున B17/ Laetrile/Amygdalin తో ఆ లోపాన్ని పోగొట్టుకోవచ్చు.

Fact: Laetrile ని క్యాన్సర్ వ్యాధికి కొంతమంది వాడుతారు కానీ దాని వల్ల క్యాన్సర్ తగ్గుతుందని లేదా తగ్గిందని అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు మరియు ఎక్కడా రుజువు కాలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తపు. 

పోస్ట్ లో చెప్పినట్టు నిజంగా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం కి చెందిన ప్రొఫెసర్ నందితా డిసౌజా ‘క్యాన్సర్ అనే పదం ఒక పెద్ద అబద్ధం’ అని చెప్పిందా అని గూగుల్ లో వెతకగా, అసలు ప్రొఫెసర్ నందితా డిసౌజా కి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి సంబంధం లేదని తెలుస్తుంది. తను ‘The Insititute of Cancer Research’ (University of London) లో రేడియోలగిస్ట్ గా పనిచేస్తుంది. తను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లో చదివినట్టుగా కానీ, పనిచేసినట్టుగా కానీ తన ప్రొఫైల్ లో రాసి ఉండదు. అంతే కాదు పోస్ట్ లో చెప్పినట్టుగా తను అన్నట్టు ఇంటర్నెట్ లో ఎక్కడా కూడా లేదు. ఇంకా చెప్పాలంటే తను పనిచేసేది పోస్ట్ లో వ్యతిరేకించిన ‘క్యాన్సర్ అనే వ్యాధి’ చికిత్స మీద.

పోస్ట్ లో చెప్పినట్టు కాన్సర్ వ్యాధిని B17 తో నయం చేయొచ్చు అని కొన్ని పుస్తకాలు వచ్చాయి కానీ నిజంగా క్యాన్సర్ అనేది కేవలం B17 విటమిన్ లోపమా? B17/ Laetrile/Amygdalin తో ఆ లోపాన్ని పోగొట్టుకోవచ్చా? అని గూగుల్ లో చూడగా, ఈ విషయంపై కొన్ని రీసర్చ్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. వాటిలో B17/ Laetrile/Amygdalin తో క్యాన్సర్ నయం అవుతున్నట్టు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేనట్టు మరియు ఎక్కడా రుజువు కానట్టు ఉంటుంది.

రీసర్చ్ ఆర్టికల్:

Cancer Research, UK:

National Center for Biotechnology Information, US:

అంతే కాదు, రెండేళ్ళ క్రితమే ఈ విహాయం తప్పు అంటూ Snopes వారు ఆర్టికల్ కూడా రాసారు. చివరగా, B17/ Laetrile/Amygdalin తో క్యాన్సర్ నయం అవుతుందని అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు మరియు ఎక్కడా రుజువు కాలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?