ATM లో CANCEL బటన్ రెండు సార్లు నొక్కడం గురించి RBI ఎటువంటి ప్రకటన చేయలేదు

ATM నుండి డబ్బు డ్రా చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన చిట్కాను ఇటీవల RBI ప్రకటించింది అంటూ ఈ మధ్య ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చాలా షేర్ అవుతోంది. ఈ పోస్ట్ ప్రకారం మనం డబ్బు డ్రా చేయడానికి ATMలో card insert చేసేకంటే ముందు CANCEL buttonను రెండు సార్లు నొక్కితే ఎవరైనా మన PIN Number దొంగిలించడానికి ఏదైనా setting చేసివుంటే అది cancel అయిపోతుంది, మన PIN number భద్రంగా వుంటుంది అని ప్రచారం అవుతోంది. ఆ పోస్ట్ లో ఎంత వరకు నిజముందో తెలుసుకుందాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ATMలో card insert చేసేకంటే ముందు CANCEL button ను రెండు సార్లు press చేస్తే, ఎవరైనా మన PIN Number దొంగిలించడానికి ఏదైనా setting చేసివుంటే అది cancel అయిపోతుంది

ఫాక్ట్ (నిజం): RBI అటువంటి చిట్కాను ఎక్కడా ప్రకటించలేదు. కావున పోస్ట్ లో చెప్పిన సమాచారం లో ఎలాంటి నిజం లేదు.

RBI వెబ్సైటు లో ATM వాడుకకి సంబంధించి చాలా సమాచారాన్ని ఇచ్చారు. కానీ అందులో ఎక్కడా కూడా పోస్ట్ లో చెప్పినట్టు CANCEL బటన్ ను రెండు సార్లు press చేస్తే, ఎవరైనా మన PIN Number దొంగిలించడానికి ఏదైనా setting చేసివుంటే అది cancel అయిపోతుంది, మన PIN number భద్రంగా వుంటుంది అని చెప్పలేదు. అలానే పోస్ట్ లో చెప్పిన సమాచారం, ఫోటో వాళ్ళ ఫేస్బుక్ మరియు ట్విట్టర్ ఖాతాలలో కూడ ఎక్కడా పెట్టలేదు.

ఇలాంటి తప్పుడు సమాచారమే భారత్, ఇతర దేశాలలో ఇంతకు ముందు చాలా సార్లు ప్రచారం జరిగింది అని Snopes మరియు Africa Check  ప్రచురించాయి.

చివరగా, ATM లో CANCEL బటన్ రెండు సార్లు నొక్కడం గురించి RBI ఎటువంటి ప్రకటన చేయలేదు, పోస్ట్ లో చెప్పిన సమాచారం లో నిజం లేదు.