Fake News, Telugu
 

ముస్లిం మహిళలపై నీళ్లు పోస్తున్నది బీజేపీ కార్యకర్తలు కాదు, అది శ్రీ లంక యూనివర్సిటీ ర్యాగింగ్ వీడియో

0

ముస్లిం మహిళల పై బురద నీళ్లు పోస్తూ పైశాచికానందాన్ని పొందిన బీజేపీ కార్యకర్తలు. సాటి మహిళలను గౌరవించని మీరేం కార్యకర్తలు’ అంటూ ఫేస్బుక్ లో ఒక విడియోతో కూడిన పోస్టు ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్చీవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ముస్లిం మహిళల పై బురద నీళ్లు పోస్తున్నది బీజేపీ కార్యకర్తలు .

ఫాక్ట్ (నిజం): పోస్టులో పెట్టిన వీడియో భారత దేశం లో జరిగిన సంఘటనది కాదు. అది శ్రీలంకలోని ఒక యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ కి సంబంధించిన వీడియో. కావున, పోస్టులో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.  

ఫేస్బుక్ పోస్టు యొక్క కామెంట్స్ విభాగం లో చూసినప్పుడు, ఆ వీడియో శ్రీలంక కి సంబంధించిన వీడియో అని చాలా మంది పేర్కొన్నారు. పోస్టులోని వీడియోని ఇన్విడ్ ప్లగిన్ లో కీఫ్రేమ్స్ గా విభజించి, వాటిని రివర్స్ ఇమేజ్ చేయగా వచ్చిన సెర్చ్ రిజల్ట్స్ లో కూడా ఆ వీడియో శ్రీలంక లో ఈస్టర్న్ యూనివర్సిటీకి సంబంధించినదని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ పేర్కొన్నారు.

వీటిని బట్టి ఈ వీడియో భారత దేశానికి సంబంధించినది కాదని, శ్రీలంక లోని యూనివర్సిటీ లో ర్యాగింగ్ కి సంబంధించినదని చెప్పవచ్చు. గతంలో కూడా ఇలాంటి వీడియోని తమిళనాడు లో RSS కి చెందిన కొందరు యువకులు ముస్లిం మహిళలలను వేదిస్తున్నారంటూ ప్రచారం జరిగినప్పుడు అది తప్పు అని FACTLY ఒక ఫాక్ట్ చెక్ ఆర్టికల్ రాసింది.

చివరగా, శ్రీ లంక యూనివర్సిటీ లో జరిగిన ర్యాగింగ్ వీడియోని ముస్లిం మహిళలపై బురద నీళ్లు పోస్తున్న బీజేపీ కార్యకర్తలు అంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll