శ్రీలంకలోని ఫోటోని పెట్టి భారత మహిళల రక్షణలో బీజేపి విఫలమైనట్టుగా చూపిస్తున్నారు

బీజేపీ పాలనలో ఆడవాళ్లకు రక్షణ లేదని చెప్తూ ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని కొంత మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): బీజీపీ దేశంలోని ఆడవాళ్లకు రక్షణ కల్పించడంలో ఫెయిల్ అయ్యిందని చెప్పడానికి పోస్ట్ లోని ఫొటోనే నిదర్శనం.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటోని శ్రీలంకలో తీసారు. శ్రీలంకలో ఒసారియ అనే వస్త్రాధరణ సాంప్రదాయాన్ని చూపెట్టడానికి తను అలా వేసుకుంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, అది శ్రీలంక లో తీసిన ఫోటో అని తెలుస్తుంది. పోస్ట్ లోని ఫొటోలే కాకుండా ఇంకా చాలా ఫోటోలు ‘Theertha Performance Platform’ వెబ్ సైట్ లో ఉంటాయి. ఆ ఫోటోల వివరణ చూస్తే, ఫోటో లోని మహిళ ఒసారియ అనే వస్త్రాధరణ సాంప్రదాయాన్ని చూపెట్టడానికి అలా వైర్లను వేసుకుందని రాసి ఉంటుంది. అలానే ఒక ఫోటోలో తన వెనకాల ‘AMI Lanka (Pvt) Ltd.’ అని ఉన్న బోర్డు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఫోటో ఇండియాలో కాదు, శ్రీలంకలో లో తీసినట్టుగా నిర్ధారణకు రావొచ్చు.

చివరగా, శ్రీలంకలోని ఫోటోని పెట్టి భారత మహిళల రక్షణలో బీజేపి విఫలమైనట్టుగా చూపిస్తున్నారు.  

ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?