వీడియో లో సరైన స్కూల్ షూస్ వేసుకోని పిల్లలను టీచర్ కొడుతున్నాడు

ఒక టీచర్ కేవలం హిందూ విద్యార్థులను కొడుతున్నాడు అంటూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. కొందరేమో ఇదే వీడియోని ముస్లిం విద్యార్థుల్లో ఎవరైతే హిజాబ్ వేసుకోలేదో వారిని టీచర్ కొడుతున్నట్టుగా పోస్ట్ చేసారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): హిందూ విద్యార్థులను హింసిస్తున్న మత పిచ్చి టీచర్.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసిన వీడియోని సరిగ్గా చూస్తే టీచర్ విద్యార్థుల కాళ్ళను చూస్తూ ఎవరైతే స్కూల్ షూస్ వేసుకోలేదో వారినే కొడుతున్నాడు. పోస్ట్ లో చెప్పినట్టు మతం ఆధారంగా టీచర్ వాళ్ళను కొట్టట్లేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

వీడియోలో టీచర్ ని సరిగ్గా చూస్తే తను విద్యార్థుల కాళ్ళను చూస్తున్నట్టు చూడవచ్చు. అలానే, దెబ్బలు తిన్న విద్యార్థుల కాళ్ళను గమనిస్తే వారు సరైన స్కూల్ షూస్ వేస్కోనట్టు తెలుస్తుంది. కాబట్టి పోస్ట్ లో చెప్పినట్టు మతం ఆధారంగా విద్యార్థులను టీచర్ కొట్టట్లేదు. అలానే, హిజాబ్ వేసుకోని ఆడ పిల్లలనే కాదు, ఒక అబ్బాయిని కూడా కొట్టినట్టు వీడియోలో చూడవచ్చు. కావున కొందరు చెప్పినట్టుగా హిజాబ్ వేసుకొని ఆడ పిల్లలనే టీచర్ కొట్టాడు అనే దాంట్లో నిజం లేదు.

చివరగా, వీడియో లో సరైన స్కూల్ షూస్ వేసుకోని పిల్లలను టీచర్ కొడుతున్నాడు.