Fake News, Telugu
 

వీడియో కశ్మీర్ కి సంబంధించినది కాదు. అది పుల్వామా దాడులకు నిరసనగా బెంగళూరు లో చేపట్టిన ర్యాలీ

0

కొంతమంది ముస్లింలు ర్యాలీ చేస్తున్న వీడియో ఒకటి ఫేస్బుక్ లో పోస్టు చేసి, అది కశ్మీర్ లో జరుగుతున్నదని ఆరోపిస్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): పోస్టులో పెట్టిన వీడియో కాశ్మీర్ లో ముస్లింలు ర్యాలీ చేస్తున్నది .

ఫాక్ట్ (నిజం): ఆ వీడియో పుల్వామా దాడుల అనంతరం, బెంగుళూరు లోని బోర ముస్లింలు పుల్వామా దాడులకు నీరసనగా ర్యాలీ చేప్పటినప్పటిది. అది కశ్మీర్ లో ముస్లింల రాలీ కాదు. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.      

పోస్టులో పెట్టిన వీడియోలో కనిపిస్తున్న ముస్లింలు ‘జవాన్ అమర్ రహే’ అని అనడం వినవచ్చు. మరియు వీడియోని క్షుణ్ణంగా చూసినట్లయితే -0:24 దగ్గర ముస్లింలు ర్యాలీగా వెళ్తున్నపుడు, “Burhani Flora” అనే పేరుతో ఉన్న అపార్ట్మెంట్ ని చూడవచ్చు. గూగుల్ మ్యాప్స్ లో ఆ పేరుతో వెతికినప్పుడు, ఆ అపార్ట్మెంట్ ‘బెంగళూరు’ లో ఉన్నట్లుగా తెలిసింది.

ఆ విధంగా లభించిన సమాచారంతో యూట్యూబ్ లో “muslims rally jawan bangalore” అనే కీవర్డ్స్ తో వెతకగా, చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. వాటిని పరిశీలించినప్పుడు, పోస్టులో పెట్టిన వీడియో కూడా “Bohra Muslims in Bangalore” అనే టైటిల్ తో లభించింది. ఆ వీడియో యొక్క టైంస్టాంప్ చూసినప్పుడు, దానిని ఫిబ్రవరి 22, 2019 న యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్లుగా తెలిసింది. ఆ వీడియో క్రింద ఉన్న వివరణ ఆధారంగా, బెంగళూరులోని బన్నేర్‌ఘట్టా రోడ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న బోహ్రా ముస్లింలు అమరవీరులైన సిఆర్‌పిఎఫ్ జవాన్ల జ్ఞాపకార్థం ర్యాలీ చేపట్టినది అని తెలుసుకోవచ్చు.

పుల్వామాలో సిఆర్‌పిఎఫ్ జవాన్ల పై ఉగ్రవాదుల దాడి ఫిబ్రవరి 14, 2019 న జరిగింది. ఆ దాడిలో సుమారు నలభై నాలుగు మంది జవాన్లు చనిపోయారు. ఫేస్బుక్ పోస్ట్ లో పెట్టిన  వీడియో ఆ జవాన్ల జ్ఞాపకార్థం చేపట్టిన ర్యాలీది అయి ఉండవచ్చు. గూగుల్ లో మరియు ఫేస్బుక్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు కూడా ఆ వీడియో బెంగుళూరు లోని బోర ముస్లింలు అమరవీరులైన సిఆర్‌పిఎఫ్ జవాన్ల జ్ఞాపకార్థం ర్యాలీ  చేపట్టినప్పటిది అని సెర్చ్ రిజల్ట్స్ లో లభించిన సమాచారం ఆధారంగా తెలిసింది.

చివరగా, ఆ వీడియో కశ్మీర్ కి సంబంధించినది కాదు. అది పుల్వామా దాడులకు నిరసనగా బెంగళూరు లో చేపట్టిన ర్యాలీది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll