‘మన ఇండియా లోనే ముస్లిం ఆడవారి యొక్క బురఖా ధరించి.. మత కలహాలు సృష్టించాలని చూసిన ఎదవకి పట్టుకుని దేహశుద్ది చేసిన స్థానికులు..’ అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన వీడియోని చాలా మంది షేర్ చేస్తున్నారు.ఆ పోస్ట్ లో ఆరోపించిన విషయాలు ఎంత వరకు వాస్తవమో ఓసారి విశ్లేషిద్దాం .
క్లెయిమ్ (దావా): ఒక వ్యక్తి ముస్లిం మహిళలు ధరించే బురఖా వేసుకొని మత కలహాలు సృష్టిస్తున్నాడు.
ఫాక్ట్ (నిజం): బురఖా ధరించిన వ్యక్తి గోవాకి చెందిన విర్గిల్ బోస్కో ఫెర్నాండెజ్. ఆయనకి గత కొద్ది కాలంగా మతి స్థిమితంగా లేకపోవడంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. కావున ఒక మానసిక రోగి చేసిన చర్యలతో కూడిన వీడియోని అవాస్తవమైన కథనం తో కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఈ విషయం గురించి గూగుల్ లో వెతికినప్పుడు INDIA TODAY లో ఫిబ్రవరి 17, 2019న ప్రచురితం అయిన ఈ ఆర్టికల్ లభించింది . దీంట్లో ఉన్న కథనం ప్రకారం బోస్కో ఫెర్నాండెజ్ విర్గిల్ అనే వ్యక్తి బురఖా ధరించి, పనాజి బస్ స్టాండ్ వద్ద మహిళల టాయిలెట్లోకి అడుగుపెట్టినందుకు గాను గోవా పోలీస్ వారు అతన్ని అరెస్ట్ చేసారు.
పోస్ట్ లో ఉన్న వీడియోని ఇన్విడ్ టూల్ సహాయం తో రివర్స్ సెర్చ్ చేస్తే దైనిక్ భాస్కర్ వాళ్ళు 18 ఫిబ్రవరి, 2019న ప్రచురుంచిన ఈ ఆర్టికల్ లో ఇదే వీడియో లభించింది. కాబట్టి ఆ వీడియో కి సంబంచిన ఘటన కచ్చితంగా గోవా లో జరిగింది . మరియు BOOM వారు గోవా పోలీస్ వారిని సంప్రదించినప్పుడు ‘అరెస్ట్ చేయబడిన వ్యక్తి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు . అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి మరియు మానసిక ఆరోగ్యం కోసం చికిత్స పొందుతున్నాడు’ అని వారికి తెలియజేసారు .
చివరగా, వీడియోలో ఉన్న వ్యక్తి ఒక మానసిక రోగి. ఒక మానసిక రోగి చేసిన చర్య లతో కూడిన వీడియోని అవాస్తవమైన కథనంతో కొంతమంది షేర్ చేసి తప్పుదోవ పట్టిస్తున్నారు