వీడియోలోని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నది ఉద్యోగం కోసం కాదు, భార్య కాపురానికి రావట్లేదని

ఒకప్పుడు తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈప్పుడు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారు’ అని చెప్తూ ఒక వ్యక్తి వాటర్ ట్యాంక్ పై నుండి దూకుతున్న వీడియోని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : వీడియోలో ఉద్యోగం కోసం వాటర్ ట్యాంక్ పై నుండి ఆత్మహత్య చేసుకున్న ఒక నిరుద్యోగి.       

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్పినట్టుగా వీడియోలో ఆ  వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నది ఉద్యోగం కోసం కాదు, కుటుంబ కలహాల వల్ల. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.     

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘వాటర్ ట్యాంక్ ఆత్మహత్య’ అని వెతకగా, ఈ ఘటనకు సంబంధించి వార్తాపత్రికల్లో వచ్చిన కొన్ని ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. వీడియోలో ఆ వ్యక్తి తన భార్య కాపురానికి రావట్లేదని వాటర్ ట్యాంక్ పై నుండి దూకినట్టుగా ‘V6 వెలుగు‘ మరియు ‘Telangana Today’ ఆర్టికల్స్ ద్వారా తెలుస్తుంది. ఈ సంఘటన శనివారం (17 ఆగష్టు 2019) రోజు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామంలో జరిగింది.

చివరగా, వీడియోలోని వ్యక్తి ఆత్మహత్య చేసుకుంది ఉద్యోగం కోసం కాదు, భార్య కాపురానికి రావట్లేదని.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?