రోహింగ్యాలకు సంభందించి కాంగ్రెస్ తమ మేనిఫెస్టో లో ఎటువంటి వాగ్ధానం చేయలేదు.

కాంగ్రెస్ తమ మేనిఫెస్టో లో రోహింగ్యాలకు అనుకూలంగా వాగ్దానాలు చేసిందని ఫేస్బుక్ లో కొందరు పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): కాంగ్రెస్ మేనిఫెస్టో: “రోహింగ్యాలు భారత్ లో స్థిరపడేలా సవరిస్తాం. వారి జోలికి వచ్చినవారి తాట తీస్తాం. వారిని అతిధులుగా చూస్తాం.”

ఫాక్ట్ (నిజం): కాంగ్రెస్ మేనిఫెస్టో లో రోహింగ్యాలకు సంభందించి ఎటువంటి వాగ్ధానాలు లేవు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

కాంగ్రెస్ అధికారిక వెబ్ సైట్ లో వాళ్ళ మేనిఫెస్టో ని చూడవచ్చు. ఆ మేనిఫెస్టో లో వెతికినప్పుడు రోహింగ్యాలకు సంభందించి ఎటువంటి వాగ్ధానం కనిపించదు. రోహింగ్యా అనే పదం కూడా ఆ మేనిఫెస్టో లో దొరకదు. కావున పోస్ట్ లో చెప్పిన వాఖ్యలు కాంగ్రెస్ మేనిఫెస్టో లో లేవు.

కాంగ్రెస్ మానిఫెస్టో ఫారిన్ పాలసీ సెక్షన్ లో అసైలం కి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఒక చట్టం ని తీసుకువస్తాం అని చెప్పారు కానీ ఆ చట్టం కి సంబంధించి ఎటువంటి వివరాలు లేవు.

కావున, రోహింగ్యాలకు అనుకూలంగా కాంగ్రెస్ తమ మేనిఫెస్టో లో ఎటువంటి వాగ్ధానం చేయలేదు.