Fake News, Telugu
 

రోమ్‌లో ఇటాలియన్ వైమానిక దళం యొక్క ఇటాలియన్ జెండా ట్రై-కలర్స్ ఎయిర్ షోను విదేశాల్లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుక గా తప్పుడు ప్రచారం చేస్తున్నారు

0

‘ఆగస్టు పదిహేను సందర్భంగా నిన్న విదేశాల్లో సైతం ధగధగలాడిన మూడు రంగులు’ అంటూ ఒక వీడియో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : వీడియో విదేశాల్లో జరిగిన భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుక కి సంబంధించినది.       

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని విడియో రోమ్ (ఇటలీ) లోని అల్టారే డెల్లా పాట్రియా భవనం దగ్గర తీసినది. ఆ వీడియోలోని త్రివర్ణ రంగులు ఇటలీ జెండాను సూచిస్తున్నాయి, భారత జెండాను కాదు. ఆ వీడియోలో కనిపించేది ఇటాలియన్ వైమానిక దళం యొక్క ఏరోబాటిక్ బృందం (‘ఫ్రీక్కి ట్రికోలోరి’) చేసిన ఎయిర్ షో. దానిని సాధారణంగా ఇటలీ రిపబ్లిక్ దినోత్సవం రోజున చేస్తారు. కావున, పోస్ట్‌లో చేసిన ఆరోపణ తప్పు.

వీడియో ని ఇన్విడ్  ప్లగిన్ ద్వారా విభజించగా వచ్చిన కీ ఫ్రేమ్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికినప్పుడు, ఆ వీడియోలో కనిపించే భవనం ఇటలీలోని పియాజ్జా వెనిజియా (రోమ్) లో ఉన్న ఆల్టారే డెల్లా పాట్రియా అని తెలిసినది.

ఆ వీడియోలో కనిపించేది ఇటాలియన్ వైమానిక దళం యొక్క ఏరోబాటిక్ బృందం ‘ఫ్రీక్కి ట్రికోలోరి’ (త్రివర్ణ బాణాలు) చేసిన ఎయిర్ షో.  దానిని సాధారణంగా ఇటలీ రిపబ్లిక్ దినోత్సవం రోజున న చేస్తారు. ఆ ఈవెంట్ కి సంబంధించిన మరి కొన్ని ఫోటోలు ఇక్కడ చూడవచ్చు. ‘ఫ్రీక్కి  ట్రికోలోరి’ ప్రదర్శనలోని మూడు రంగులు (ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు) ఇటాలియన్ జెండాను సూచిస్తాయి.

ఇటలీ జాతీయ జెండా:

చివరగా, రోమ్‌లో ఇటాలియన్ వైమానిక దళం యొక్క ఇటాలియన్ జెండా ట్రై-కలర్స్ ఎయిర్ షోను విదేశాల్లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుక గా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll