మోడీ మరియు భారత మీడియాని విమర్శిస్తూ TIME మాగజిన్ పై ఎటువంటి కవర్ ఫోటో ప్రచురితమవ్వలేదు

మీడియా మోడీ ఇచ్చే ఫండింగ్ కోసం తన చెప్పుచేతుల్లో పనిచేస్తుందని టైమ్ మాగజిన్ తన కవర్ పేజీ పై ఒక కార్టూన్ వేసింది అంటూ ఒక ఫోటోని ఫేస్బుక్ లో కొంత మంది షేర్ చేసారు. ఆ ఫోటోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): టైం మాగజిన్ పై మోడీ కార్టూన్. భారతీయ సమాచార మాధ్యమాల పై విదేశీ చురక

.ఫాక్ట్ (నిజం): ఒరిజినల్ కార్టూన్ ని ఎడిట్ చేసి మోడీ మొహాన్ని అతికించారు. కావున ఆ పోస్ట్ లో నిజం లేదు

పోస్ట్ చేసిన ఫోటోని గూగల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే అసలు ఫోటో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది.అలానే ఫోటోలో కింద ఆర్టిస్ట్ సంతకం చూస్తే ‘Horsey 2012 Los Angeles Times’ అని ఉంటుంది. ఫోటోలోని వివరణతో గూగుల్ లో ‘Time cover on corporate campaign donations’ అని వెతికినప్పుడు సెర్చ్ రిజల్ట్స్ లో ఒరిజినల్ ఆర్టికల్ దొరుకుతుంది. దాన్ని బట్టి పోస్ట్ చేసింది ఒక ఎడిటెడ్ ఫోటో అని నిర్ధారణకి రావొచ్చు.

చివరగా, పోస్ట్ చేసిన ఫోటోలో మోడీ బొమ్మ ని అతికించారు. ఒరిజినల్ ఫోటో మీద వేరే ముఖం ఉంది.