Fake News, Telugu
 

మోడీ గురువాయూర్ గుడి లోపలికి చెప్పులు వేసుకొని ప్రవేశించలేదు

0

ప్రధాని మోడీ ఒక గుడి లోపలికి చెప్పులు వేసుకొని ప్రవేశించి దానిని అవమానపరిచారు అంటూ కొంతమంది ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో ఎంత వరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): మోడీ దేవాలయం లోపలికి చెప్పులు వేసుకొని ప్రవేశించి దానిని అవమానపరిచారు.

ఫాక్ట్ (నిజం): మోడీ తాను బస చేసిన గెస్ట్ హౌస్ నుండి గుడి ఆవరణలోకి చెప్పులు వేసుకుని వచ్చారు. కానీ, గర్భ గుడిలోకి ప్రవేశించే సమయంలో వాటిని బయటే విడిచి పెట్టి లోపలికి వెళ్లారు. కావున, పోస్ట్ ప్రక్కద్రోవ పట్టించేలా ఉంది.

పోస్టులో పెట్టిన ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, అది మోడీ జూన్ 8, 2019 న కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ లో ఉన్న గురువాయూర్ దేవాలయాన్ని సందర్శించినప్పటిది అని తెలిసింది. ఆ పూర్తి కార్యక్రమాన్ని DD News వారు వీడియో తీశారు. ఆ వీడియోని చూసినట్లయితే మోడీ తాను బస చేసిన “శ్రీవిలసం” గెస్ట్ హౌస్ నుండి గుడి ఆవరణంలోకి చెప్పులు వేసుకుని రావడం చూడవచ్చు. వీడియో 3:49 దగ్గర మోడీ గర్భగుడి లోకి ప్రవేశించే ముందు తన చెప్పులు వదిలి వెళ్లారు.

ఆ తరవాత 18:42 దగ్గర మోడీ తన తూలాభరణం సమయంలో మరియు 19:12 దగ్గర గుడి లోపల నడుస్తున్న సమయంలో చెప్పులు లేకుండా ఉండడం చూడవచ్చు.

మోడీ దైవ దర్శనం అనంతరం తిరిగి చెప్పులు వేసుకోవడం 23:47 దగ్గర చూడవచ్చు. గుడి నుండి తిరిగి తాను బస చేసిన గెస్ట్ హౌస్ కి వెళ్ళేటప్పుడు(24:31) చెప్పులు వేసుకొని వెళ్లారు.

చివరగా, మోడీ గురవయ్యుర్ దేవాలయం లోకి చెప్పులు వేసుకొని ప్రవేశించలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll