మోదీ ఉపయోగిస్తున్నది భారత త్రివర్ణ పతాకం కాదు, అదే రంగులో ఉన్న స్కార్ఫ్ మాత్రమే

ఫేస్బుక్ లో ఒక వ్యక్తి ‘ఇప్పుడు చెప్పండి ర్రా ఇక్కడ ఎవరికి దేశ భక్తి ఉందో చిల్లర వెదవల్లరా.’ అంటూ తన వాల్ పైన జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ మరియు ప్రధాని మోదీతో కూడిన చిత్రాన్ని  పోస్ట్ చేసాడు. అందులో ఎంత వరకు నిజం ఉందో  ఓసారి విశ్లేషిద్దాం.

క్లెయిమ్ (దావా): ప్రధాని నరేంద్ర మోదీ దేశ త్రివర్ణ పతాకాన్ని తన రుమాలుగా ఉపయోగించి దానిని కించపరుస్తున్నారు

ఫాక్ట్ (నిజం):  ప్రధాని మోదీ రుమాలుగా ఉపయోగిస్తున్నది  త్రివర్ణ పతాకం రంగులో ఉన్న స్కార్ఫ్ , కానీ త్రివర్ణ పతాకం  కాదు. కావున త్రివర్ణ పతాకాన్ని తన రుమాలుగా ఉపయోగిస్తున్నారు అనడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే.

ప్రధాని మోదీకి సంబంధించి ఉన్న చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ చిత్రం 2016లో ఆయన  పాల్గొన్న మూడవ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవానికి సంబంధించినదిగా గుర్తించబడింది . యోగా దినోత్సవానికి సంబంధించిన ఇతర చిత్రాలను   చూసినట్లయితే అందులో మోదీ త్రివర్ణ పతాకం రంగులో ఉన్న స్కార్ఫ్ ని ధరించి ఉండడం స్పష్టంగా చూడవచ్చు.  Amazon.in లో త్రివర్ణ పతాకం రంగులో ఉన్న స్కార్ఫ్ కోసం వెతికినపుడు ఇలాంటి చాలా స్కార్ఫ్ లు   వచ్చాయి.

చివరగా, మోదీ చెమట తుడ్చుకోవడానికి ఉపయోగిస్తున్నది  త్రివర్ణ పతాకం రంగులో ఉన్న స్కార్ఫ్.