Fake News, Telugu
 

మెసొపొటేమియన్ నాగరికతకు చెందిన రాజు మరియు సైనికుల విగ్రహాలను రాముడు మరియు హనుమంతుడని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

శ్రీరాముడు మరియు హనుమంతుని ప్రాచీన విగ్రహాలు ఇరాక్ లో తవ్వకాలు జరుగుతున్నప్పుడు దొరికాయని చెప్తూ ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని కొంత మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఇరాక్ లో తవ్వకాలు జరుగుతున్నప్పుడు, శ్రీరాముడు మరియు భక్త హనుమంతుని 6000 సంవత్సరాల పూర్వపు ప్రాచీన విగ్రహాలు లభించాయి.

ఫాక్ట్ (నిజం): ఫోటో లో ఉన్నది రాముడు మరియు హనుమంతుడు కాదు. అది ఇరాక్ లోని బెలుహ పాస్ కొండల మీద చెక్కబడిన మెసొపొటేమియన్ నాగరికతకు చెందిన రాజు మరియు ఇద్దరు హుర్రియన్ సైనికులు. అవి పోస్ట్ లో చెప్పినట్టుగా ఆరు వేల సంవత్సరాల క్రితం విగ్రహాలు కావు, సుమారు నలుగు వేల సంవత్సరాల క్రితం చెక్కబడినవి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ‘Ancient History’ ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ ప్రకారం పోస్ట్ లో పెట్టిన విగ్రహాలు ఇరాక్ (బెలుహ పాస్) లోనివే, కానీ ఆ విగ్రహల్లో ఉన్నది రాముడు మరియు హనుమంతుడు కాదు. దాంట్లో ఉన్నది మెసొపొటేమియన్ నాగరికతకు చెందిన రాజు మరియు హుర్రియన్ సైనికులు. ఆ విగ్రహం పక్కన అక్కాడియన్ శాసనం కూడా ఉన్నట్టుగా ఆర్టికల్ లో చదవచ్చు. అంతే కాదు, పోస్ట్ లో చెప్పినట్టుగా అది ఆరు వేల సంవత్సరాల ప్రాచీన విగ్రహం కాదు, నాలుగు వేల సంవత్సరాల క్రితంది. ఈ రాజును ‘తార్ దున్ని’ అని కూడా సంబోధిస్తారు. ఇదే విషయం వికీపీడియా ఆర్టికల్ లో కూడా దొరుకుతుంది. ఈ ఆర్టికల్ లో పోస్ట్ లో ఇచ్చినటువంటి విగ్రహాల ఫోటో కూడా చూడొచ్చు.

చివరగా, మెసొపొటేమియన్ నాగరికతకు చెందిన రాజు మరియు సైనికుల విగ్రహాలను రాముడు మరియు హనుమంతుడని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll