Fake News, Telugu
 

భార్యలను తినొచ్చని సౌదీ షేక్ ఫత్వా జారీ చేయలేదు. 2015 లోనే తప్పుగా తేలిన వార్తను మళ్ళీ ప్రచరం చేస్తున్నారు

0

మగవాళ్ళకు తీవ్రంగా ఆకలి వేస్తే తమ భార్యలను తినొచ్చని ఒక సౌదీ షేక్ ఫత్వా జారీ చేసినట్టు చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలామంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఆకలి వేస్తే మగవాళ్ళు తమ భార్యలను తినొచ్చని ఫత్వా జారీ చేసిన సౌదీ గ్రాండ్ ముఫ్తీ షేక్.

ఫాక్ట్ (నిజం): ఇది 2015 వార్త. అప్పట్లోనే తను అలాంటి ఎటువంటి ఫత్వా జారీ చేయలేదని గ్రాండ్ ముఫ్తీ తెలిపాడు. అంతే కాదు పోస్ట్ లో పెట్టిన ఇండియా టుడే ఆర్టికల్ లో కూడా ఈ వార్తని ఒక బ్లాగ్ లో వ్యంగ్యంగా రాసిన వ్యాసం నుండి తీసుకున్నట్టు CNN తెలిపినట్టు ఉంటుంది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.  

పోస్ట్ లో ఇచ్చిన ఫోటో చూస్తే, ఆ వార్త ‘ఇండియా టుడే’ లో వచ్చినట్టు ఉంటుంది. గూగుల్ లో ఆ వార్త కోసం వెతకగా, ఆ వార్త ని ఇండియా టుడే  వారు 2015 లో ప్రచురించినట్టు తెలుస్తుంది. ఆ ఆర్టికల్ లో ఈ వార్తని ‘Mirror’ సంస్థవారు రిపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. కానీ, Mirror సంస్థ వారు ఆ ఆర్టికల్ ని ఇప్పుడు తీసేసారు. ఆ ఆర్టికల్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చదవచ్చు. ఇండియా టుడే ఆర్టికల్ లోనే ఈ వార్త పై 2015 లో సౌదీ గ్రాండ్ ముఫ్తీ షేక్ మాట్లాడుతూ తను అలాంటి ఎటువంటి ఫత్వా జారీ చేయలేదని, ఇది తన శత్రువులు చేస్తున్న కుట్ర అని తెలిపాడని ఉంటుంది. పూర్తి ఆర్టికల్ చదవకుండా కేవలం హెడ్డింగ్ చదివి సోషల్ మీడియా లో తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

CNN అరబిక్ ఆర్టికల్ లో ఈ వార్తని ఒక బ్లాగ్ లో వ్యంగ్యంగా రాసిన వ్యాసం నుండి తీసుకున్నట్టు చదవచ్చు. మరింత సమాచారం కోసం 2015 లోనే వివిధ సంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.

చివరగా, భార్యలను తినొచ్చని సౌదీ షేక్ ఫత్వా జారీ చేయలేదు. 2015 లోనే తప్పుగా తేలిన వార్తను మళ్ళీ ప్రచరం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll