భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారు BJP నాయకులకు నమస్కరిస్తే, వారు ప్రతి నమస్కారం చేయలేదు అనేది అవాస్తవం

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ BJP నాయకులకు నమస్కరిస్తే,  వారు ప్రతి నమస్కారం చేయలేదు అని ఒక ఫోటో తో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఆరోపించిన విషయాల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): దళితుడు అవ్వడం వల్ల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ BJP నాయకులకు నమస్కరిస్తే, వారు ప్రతి నమస్కారం చేయలేదు.

ఫాక్ట్ (నిజం): పూర్తి వీడియో చూస్తే బీజేపీ నాయకులు కూడా రామ్ నాథ్ కోవింద్ కి నమస్కరించినట్టు తెలుస్తుంది. బీజేపీ నాయకులు చేతులు దించిన తరువాత తీసిన ఫోటో పెట్టి తప్పుదోవపట్టిస్తున్నారు.

పోస్ట్ లోని కామెంట్స్ లో చూస్తే ఒకరు ఫోటో కి సంభందించిన వీడియో లింక్ పెట్టారు. ఆ వీడియో చూస్తే భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో ప్రసంగించడానికి వచ్చినప్పటిదని తెలుస్తుంది. వీడియోలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ BJP నాయకులకు నమస్కరిస్తే, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు మరియు ఇతర ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర  BJP నాయకులు ఆయనకు ప్రతి నమస్కారం చేస్తారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు

చివరగా, బీజేపీ నాయకులు చేతులు దించిన తరువాత తీసిన ఫోటో పెట్టి తప్పుదోవపట్టిస్తున్నారు.