Fake News, Telugu
 

బీహార్ రాష్ట్రంలో ముహర్రంకి సంబంధించిన వీడియో యొక్క ఆడియోని మార్చి తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారు

0

కాంగ్రేస్ పాలిత మధ్యప్రదేశ్ ,భోపాల్ సిటీలో RSSకి వ్యతిరేఖంగా కత్తులు పట్టుకుని నడిరోడ్డు మీద నినాదాలు చేస్తున్న శాంతి కాముకులు” అంటూ ఫేస్బుక్ లో ఒక వీడియోని చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని భోపాల్ లో RSSకి వ్యతిరేఖంగా ముస్లింలు కత్తులు పట్టుకుని నడిరోడ్డు మీద నినాదాలు చేశారు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో పెట్టిన వీడియో 2017లో బీహార్ రాష్ట్రం లోని ‘దేరి’ అనే ప్రాంతంలో జరిగిన ముహర్రంకు సంబంధించినది. ఆ వీడియో కి వేరే సంబంధం లేని వీడియో యొక్క ఆడియోని జతపరిచి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.  

పోస్ట్ లో ఉన్న వీడియోని ‘ఇన్విడ్’ ప్లగ్ఇన్ లో అప్లోడ్ చేసి కీఫ్రేమ్స్ గా విభజించి, వాటిని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియోకి సంబంధించిన యూట్యూబ్ వీడియో లింక్ లభించింది. దాని టైటిల్ “Dehri on sone muharram 2017” అని ఉంది. ‘దేహరి’ అనేది బీహార్ రాష్ట్రం లోని ఒక ప్రాంతం. ఆ వీడియో అప్లోడ్ డేట్ చూసినప్పుడు నవంబర్ 11, 2017 అని తెలిసింది.

కానీ, పోస్ట్ లో పెట్టిన వీడియో యొక్క ఆడియో మరియు ఈ యూట్యూబ్ వీడియో యొక్క ఆడియో వేరేలా ఉన్నాయి. పోస్ట్ లో పెట్టిన వీడియోలో ఝార్ఖండ్ లో మరణించిన తబ్రేజ్ అన్సారీకి సంబంధించిన నినాదాలు మరియు RSS కి వ్యతిరేకముగా నినాదాలు వినిపిస్తాయి. కానీ, ఆ యూట్యూబ్ వీడియో యొక్క ఆడియోలో “dheere dheere badte rahe… Aapse guzarish hai ke dheere dheere badte rahe ( మెల్లి మెల్లిగా ముందుకు కదలండి… మీరు మెల్లిగా ముందుకు వెళ్లాలని అభ్యర్ధిస్తున్నాను)” అని ఉంటుంది. అందులో RSS కి వ్యతిరేకముగా ఎక్కడా నినాదాలు చేసినట్లుగా లేదు. ఇంతకు ముందు లభించిన యూట్యూబ్ వీడియో టైటిల్ ఆధారంగా  యూట్యూబ్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, ఆ వీడియో ‘దేహరి’ ముహర్రం పండుగ ఉత్సవాలదని సెర్చ్ రిజల్ట్స్ లో లభించిన యూట్యూబ్ వీడియోల ద్వారా తెలిసింది. ఆ వీడియోల్లోని ఆడియోని విన్నప్పుడు ఇంతకుముందు రివర్స్ సెర్చ్ ద్వారా లభించిన యూట్యూబ్ వీడియో యొక్క ఆడియోతో  సరిపోలాయి. కావున, పోస్టులో పెట్టిన వీడియో కి వేరే వీడియో యొక్క ఆడియోని జతపరిచి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఆడియో హైదరాబాద్ డెక్కన్ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇటీవల జూన్ కి అప్లోడ్ చేసిన వీడియో ది. ఈ ఆడియో ని ముహర్రం వీడియో లో పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

చివరగా, అది బీహార్ రాష్ట్రంలో ముహర్రం అప్పుడు తీసిన వీడియో

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll