ఎలక్షన్ ప్రచారం ఫోటో లో జగన్ పక్కన ఉన్నది రేణు దేశాయ్ కాదు

జగన్ ఎన్నికల ప్రచారంలో రేణు దేశాయ్ పాల్గొందంటూ ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ ని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఎన్నికల ప్రచారంలో జగన్ పక్కన నిలుచున్న రేణు దేశాయ్.

ఫాక్ట్ (నిజం): గాజువాక నియోజికవర్గం లో జగన్ ప్రచారం చేసినప్పుడు తీసిన ఫోటో అది. సాక్షి ఛానల్ ప్రసారించిన వీడియో చూస్తే తను రేణు దేశాయ్ కాదని తెలుస్తుంది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ చేసిన ఫోటో సరిగ్గా చూస్తే టైం స్టాంప్ (8th ఏప్రిల్, 2019) ఉంటుంది మరియు సాక్షి ఛానల్ నుండి ఆ ఫోటో తీసినట్టుగా చూడవచ్చు. కాబట్టి సాక్షి య్యూట్యూబ్ ఛానల్ లో 8th రోజు మరియు అంతకు ముందు అప్లోడ్ చేసిన జగన్ ప్రచార వీడియోలు వెతకగా 7th ఏప్రిల్, 2019 న అప్లోడ్ చేసిన గాజువాక YSRCP ఎలక్షన్ మీటింగ్ వీడియో దొరుకుంతుంది. ఆ వీడియో చూస్తే పోస్ట్ లోని నాయకులే వీడియో లో జగన్ వెనకాల ఉంటారు. వీడియో లో 38 నిమిషాల 20 సెకండ్ల దగ్గర పోస్ట్ లో పెట్టిన ఫ్రేమ్ వస్తది. వీడియో లో వేరే ఫ్రేమ్లు చూస్తే జగన్ పక్కన రేణుదేశాయ్ కాదు అని తెలుస్తుంది. అలానే 8th ఏప్రిల్ సాక్షి పేపర్ లో ఈ మీటింగ్ ఫోటోలు చూస్తే కూడా జగన్ పక్కన రేణు దేశాయ్ నిలబడలేదని చూడవచ్చు.  కాబట్టి పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

చివరగా, ఫోటో లో జగన్ పక్కన ఉన్నది రేణు దేశాయ్ కాదు.