ఫోటో లో ఉన్నది పుల్వామా ఘటనలో మరణించిన CRPF జవాన్లు కాదు

‘తెలుగు విశేషాలు’ అనే ఫేస్బుక్ పేజీ ఒక పోస్ట్ లో పుల్వామా ఘటనలో వీర మరణం పొందిన జవాన్లు వీరే అంటూ ఒక ఫోటో పెట్టింది. దానిని 3600 మందికి పైగా షేర్ చేసారు. ఆ ఫోటోలో ఎంత నిజముందో విశ్లేషిద్దాం

క్లెయిమ్ (దావా): ఫోటో లో ఉన్నది పుల్వామా ఘటనలో వీర మరణం పొందిన జవాన్లు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసిన ఫోటోని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అందులో ఉన్న వ్యక్తులు ధరించిన దుస్తులు CRPF జవానులు ధరించేవి కావు. అది LTTE క్యాడర్ ధరించే దుస్తులు ( క్రింది ఫోటోలో వ్యక్తి ధరించిన యూనిఫామ్).

CRPF తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పుల్వామా ఘటనలో మరణించిన 40 జవాన్ల ఫోటోని పెట్టింది. ఆ ఫోటోకి మరియు  ‘తెలుగు విశేషాలు’  ఫేస్బుక్  పేజీ పెట్టిన ఫోటో కి పొంతన లేదు. అంతే కాకుండా మరణించిన CRPF జవాన్లలో ఆడవాళ్ళు లేరు. ఫేస్బుక్ లో షేర్ అవుతున్న ఫోటోని ‘ఈలం వ్యూ’ అనే బ్లాగ్ 2014 లో వీరమరణం పొందిన వీరులు అని పోస్ట్ చేసింది .

చివరగా, ఫేస్బుక్  లో వైరల్ అవుతున్న ఫోటో పుల్వామా ఘటనలో మరణించిన CRPF జవాన్లది కాదు .