Fake News, Telugu
 

ఫోటోలో ఉన్నది జర్మనీ ప్రజల నిరసన కాదు, చైనా లోని ట్రాఫిక్ జామ్

0

జర్మనీ ప్రజలు చాలా యూనిటీగా పెట్రోల్/డీజిల్ రేట్ల పై నిరసన తెలిపి, ప్రభుత్వం రేట్లను తగ్గించేలా చేసారంటూ ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): జర్మనీ ప్రజలు తమ కార్లను నడి రోడ్డున నిలిపివేసినందున, ప్రభుత్వం పరిస్థితి అర్ధం చేసుకొని పెంచిన రేట్లను వెంటనే తగ్గించింది.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో 2012లో  చైనాలో సెలవుల సందర్భంగా అక్కడి ప్రభుత్వం మోటార్ వే టోల్స్ రద్దు చేసి రోడ్డు ప్రయాణం ఉచితం చేయడంతో ప్రజలు భారీ ఎత్తున రోడ్లపై ప్రయాణించడంతో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని షెన్‌జెన్ పట్టణంలో సంభవించిన ట్రాఫిక్ జామ్ కి సంబంధించింది. ఈ ఫోటోకి జర్మనీకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు..

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని 2012లో ప్రచురించిన ది టెలిగ్రాఫ్ పత్రిక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ ఫోటో చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లో ఉన్న షెన్‌జెన్ పట్టణంలో జరిగిన ట్రాఫిక్ జామ్ కి సంబంధించింది. 2012లో  చైనాలో సెలవుల సందర్భంగా అక్కడి ప్రభుత్వం మోటార్ వే టోల్స్ రద్దు చేసి రోడ్డు ప్రయాణం ఉచితం చేయడం ఇలా ట్రాఫిక్ జామ్ కి దారితీసిందని ఈ కథనం యొక్క సారాంశం. ఈ ట్రాఫిక్ జాం కి సంబంధించి షట్టర్ స్టాక్ ఫోటోగ్రాఫర్ తీసిన మరిన్ని ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.

పైన పేర్కొన్న వార్తా కథనం ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా 2012లో చైనాలో జరిగిన ఈ ట్రాఫిక్ జామ్ కి సంబంధించి ది అట్లాంటిక్ ప్రచురించిన వార్తా కథనం కనిపించింది. విటన్నిటి బట్టి ఈ ఫోటో జర్మనీ లో పెట్రోల్ ధరలు పెంచడంతో అక్కడి ప్రజలు నిరసనగా తమ కార్లని రోడ్లపై వదిలేసిన ఘటనకి సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

 చివరగా, ఈ ఫోటో చైనాలో జరిగిన ట్రాఫిక్ జామ్ కి సంబంధించింది; ఈ ఫోటోకి జర్మనీకి ఎటువంటి సంబంధంలేదు.

వివరణ (FEBRUARY 3, 2021):
ఈ ఆర్టికల్ ప్రచురించినప్పుడు ఇది చైనాలో 2010లో జరిగిన ట్రాఫిక్ జామ్ కి సంబంధించింది అని తెలిపాము, కానీ ఇప్పటి మా రీసెర్చ్ లో ఇది 2012లో చైనాలో జరిగిన ట్రాఫిక్ జామ్ కి సంబంధించిందని తేలింది. ఆర్టికల్ ఈ వివరాలతో మార్చబడింది.

ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll