Fake News, Telugu
 

ఫోటోలో అమ్మాయి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకోలేదు. అది ఒక ఎడిటెడ్ ఫోటో

0

ఒక అమ్మాయి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకొని ఉన్న ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఫోటోలో రిజర్వేషన్లకు వ్యతిరేఖంగా ప్లకార్డు పట్టుకున్న అమ్మాయి. 

ఫాక్ట్ (నిజం): రాజకీయ నాయకులు పదవుల కోసం చేసే పనులను వ్యతిరేకిస్తూ ఉన్న ప్లకార్డును ఒరిజినల్ ఫోటోలో అమ్మాయి పట్టుకుంది. కావున పోస్ట్ లో చూపెట్టింది తప్పు.     

పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఒరిజినల్ ఫోటో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఒరిజినల్ ఫోటోను ‘అలేఖ్య’ అనే అమ్మాయి తన ఫేస్బుక్ అకౌంట్ లో 2013 లో పెట్టింది. ఒరిజినల్ ఫోటో లో అమ్మాయి పట్టుకున్న ప్లకార్డు మీద ‘పనిలేని పనికిమాలిన రాజకీయ నాయకులారా మీ పదవుల కోసం రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చెయ్యవద్దు’ అని రాసి ఉంటుంది. ఒరిజినల్ ఫోటోని తీసుకొని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్నట్టు ఫోటోషాప్ చేసారు.

చివరగా, ఫోటోలో అమ్మాయి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకోలేదు. అది ఒక ఎడిటెడ్ ఫోటో.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll