పోస్ట్ లో చెప్పినట్టుగా చంద్రబాబు ఓట్లు అడగలేదు. జగన్ అలా ఓట్లు అడుగుతాడని చంద్రబాబు అన్నారు.

ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో తను జైలుకు పోకుండా ఉండాలంటే ప్రజలు తనకు ఓట్లు వెయ్యాలని అన్నట్టుగా ఒక వీడియోని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): చంద్రబాబు నాయుడు: “నేను జైలుకి పోకుండా ఉండాలంటే మీరు ఓట్లు వేయాలి. మీరు ఓట్లు అమ్ముకోవాలంటే నాకు మీ ఓట్లు కావాలి.”

ఫాక్ట్ (నిజం): వీడియోని చంద్రబాబు ఆడుగుతున్నట్టుగా కట్ చేసారు. మొత్తం వీడియో చూస్తే జగన్ ఇలా అంటాడు అని చంద్రబాబు అన్నారు. కావున వీడియో కొంత భాగమే పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ చేసిన వీడియో ని సరిగ్గా చూస్తే చంద్రబాబు నాయుడు గారి వెనకాల కడప లీడర్స్ ని చూడవచ్చు. కాబట్టి య్యూట్యూబ్ లో ‘chandrababu naidu kadapa roadshow’ అని సెర్చ్ చేస్తే పోస్ట్ చేసిన వీడియో యొక్క మొత్తం వీడియో వస్తుంది. ఆ వీడియో లో ‘25 min :26 sec’ దగ్గర చూస్తే చంద్రబాబు, జగన్ ఇలా అంటాడు అని పోస్ట్ లో ఉన్న వాఖ్యలు అంటాడు. కావున ఫేస్బుక్ లో సగం వీడియోనే పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

చివరగా, పోస్ట్ లో చెప్పినట్టుగా చంద్రబాబు ఓట్లు అడగలేదు. జగన్ అలా ఓట్లు అడుగుతాడని చంద్రబాబు అన్నారు.