పొన్నాని బీచ్ వీడియో పెట్టి రామ సేతు పై ప్రజలు నడుస్తున్నారని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

రామ సేతు పై ప్రజలు నిలబడ్డారని చెప్తూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): మహాసముద్రం మధ్యలో రామ సేతుపై నిలబడిన ప్రజలు.

ఫాక్ట్ (నిజం): వీడియో లో ఉన్నది రామ సేతు కాదు. అది గత సంవత్సరం కేరళలో వరదల తర్వాత పొన్నాని బీచ్ దగ్గర ప్రజలు నడవడానికి వీలుగా మట్టితో ఏర్పడిన బాట. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియోని సరిగ్గా చూస్తే, ఎడమవైపు కింద ‘Abhilash Viswa Photography’ అని ఉంటుంది. కావున ఆ పేరుతో ఫేస్బుక్ లో ఫోటోగ్రాఫర్ ఎవరైన వ్యక్తి ఉన్నారా అని వెతకగా, ‘Abhilash Viswa’ ప్రొఫైల్ ఫేస్బుక్ లో దొరుకుతుంది. తను పోస్ట్ లోని వీడియోని తన అకౌంట్ లో గత సంవత్సరం సెప్టెంబర్ లో పోస్ట్ చేసినట్టు చూడవచ్చు. కానీ ఆ వీడియో కింద వివరణ చూస్తే అది పొన్నాని బీచ్ అని ఉంటుంది.

అంతే కాదు, తను తీసిన వీడియో రామ సేతు అని వైరల్ అయ్యాక తనే స్వయంగా అది రామ సేతు కాదని ఫేస్బుక్ లో పోస్ట్ చేసాడు.

పోస్ట్ లోనిది పొన్నాని బీచ్. గత సంవత్సరం కేరళలో వరదల తర్వాత పొన్నాని బీచ్ దగ్గర ప్రజలు నడవడానికి వీలుగా మట్టితో ఒక బాట ఏర్పడింది. ఆ సమయంలో వివిధ వార్తా పత్రికలు కూడా పొన్నాని బీచ్ లో ఏర్పడిన ఈ మట్టి బాట గురించి ప్రచురించాయి.

చివరగా, పొన్నాని బీచ్ వీడియో పెట్టి రామ సేతు పై ప్రజలు నడుస్తున్నారని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?